లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

తెలంగాణ బడ్జెట్ : ప్రతీ గ్రామానికి రూ.8 లక్షలు

Publish Date - 7:46 am, Fri, 22 February 19

Rs.8 Lakhs aid for Every Village in Telangana State

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 10 జిల్లాలు ఉన్నాయని, క్రమేపి వాటిని 33 జిల్లాలుగా ఏర్పాటు చేసుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 1,036 మున్సిపాలిటీలు, 6 కార్పోరేషన్లు ఉన్నాయి. గ్రామాల అభివృధ్దికి నిధుల కొరత రానీయకుండా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు కేసీఆర్. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా గ్రామ స్వరాజ్ భావన నినాదంగానే మిగిలిపోయిందని.. సమగ్రాభివృద్ధి కోసం ఈ బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు సీఎం. నూతన పంచాయతీరాజ్ చట్టానికి ప్రభుత్వం రూప కల్పన చేశాం అని.. ఈ చట్టం ద్వారా స్ధానికి సంస్ధలకు కావాల్సిన నిధులు, అధికారాలు వస్తాయన్నారు.
Read Also: నిరుద్యోగ భృతికి రూ.1,810 కోట్లు కేటాయింపు

ఆదర్శవంతమైన గ్రామాల రూపకల్పన లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నట్లు అసెంబ్లీలో స్పష్టం చేశారాయన. ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధులు, “నరేగా” ద్వారా వచ్చే నిధులు , పంచాయతీలకు వచ్చే సొంత ఆదాయ వనరులు ఇలా అన్ని రకాల నిధులను కలిపి రాబోయే ఐదేళ్లలో గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు హర్షద్వానాల మధ్య ప్రకటించారు సీఎం కేసీఆర్.

Read Also: తెలంగాణ బడ్జెట్ : కళ్యాణ లక్ష్మి రూ.1,450 కోట్లు

ప్రతి గ్రామానికి కనీసం రూ.8 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. 500 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికీ ఈ నిధులు అందజేయటం జరుగుతుందన్నారాయన. స్ధానిక సంస్ధలకు 1400 కోట్ల రూపాయలు, పట్టణ స్ధానిక సంస్ధలకు 9వేల కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని సిఫారసు చేసిందని.. అంతకంటే ఎక్కువ నిధులు తెలంగాణ ప్రభుత్వం కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. అందుకు తగ్గట్టుగానే బడ్జెట్ లో నిధులు ఇచ్చినట్లు తెలిపారాయన. 

Read Also: ఆరోగ్య తెలంగాణ : ENT, దంత పరీక్షల కోసం రూ.5వేల కోట్లు