సంక్రాంతి ఆర్టీసి స్పెషల్ : హైదరాబాద్ లో ఎలక్ట్రికల్‌ బస్సులు రన్స్.. 

భాగ్యనగరం రోడ్లపై ఎలక్ట్రికల్‌ బస్సులు పరుగులు తీస్తున్నాయి. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు దారిలో దూసుకుపోతున్నాయి. శబ్దం రాకుండా..కాలుష్యం లేని ఈ బస్సుల్లో ప్రయాణికులు ఎక్కాలంటే మాత్రం మరో పదిరోజులు ఆగాలి. నగరంలో ఎలక్ట్రిక్ బస్సులను నడిపించాలనే ఉద్ధేశ్యంతో ఓ ప్రైవేట్‌సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న TS RTC 100 బస్సు లను అద్దెకు అద్దెకు తీసుకుంది. మొదటి విడతలో 40 ఎలక్ట్రికల్‌ బస్సులను జనవరిలో నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. 

  • Published By: veegamteam ,Published On : January 5, 2019 / 04:23 AM IST
సంక్రాంతి ఆర్టీసి స్పెషల్   : హైదరాబాద్ లో ఎలక్ట్రికల్‌ బస్సులు రన్స్.. 

భాగ్యనగరం రోడ్లపై ఎలక్ట్రికల్‌ బస్సులు పరుగులు తీస్తున్నాయి. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు దారిలో దూసుకుపోతున్నాయి. శబ్దం రాకుండా..కాలుష్యం లేని ఈ బస్సుల్లో ప్రయాణికులు ఎక్కాలంటే మాత్రం మరో పదిరోజులు ఆగాలి. నగరంలో ఎలక్ట్రిక్ బస్సులను నడిపించాలనే ఉద్ధేశ్యంతో ఓ ప్రైవేట్‌సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న TS RTC 100 బస్సు లను అద్దెకు అద్దెకు తీసుకుంది. మొదటి విడతలో 40 ఎలక్ట్రికల్‌ బస్సులను జనవరిలో నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. 

హైదరాబాద్‌ : భాగ్యనగరం రోడ్లపై ఎలక్ట్రికల్‌ బస్సులు పరుగులు తీస్తున్నాయి. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు దారిలో దూసుకుపోతున్నాయి. శబ్దం రాకుండా..కాలుష్యం లేని ఈ బస్సుల్లో ప్రయాణికులు ఎక్కాలంటే మాత్రం మరో పదిరోజులు ఆగాలి. నగరంలో ఎలక్ట్రిక్ బస్సులను నడిపించాలనే ఉద్ధేశ్యంతో ఓ ప్రైవేట్‌సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న TS RTC 100 బస్సు లను అద్దెకు అద్దెకు తీసుకుంది. మొదటి విడతలో 40 ఎలక్ట్రికల్‌ బస్సులను జనవరిలో నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. మియాపూర్‌ రూ్ కు  2.. కంటోన్మెంట్‌ డిపోలకు 20 ఎలక్ట్రికల్‌ బస్సులు కేటాయించగా..డ్రైవర్ల వర్కింగ్ స్టైల్ చెక్ చేసేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ రూట్లలో ఈ బస్సుల ట్రయల్‌ రన్స్‌ నడుపుతున్నారు.

ఎలక్ర్టిక్‌ బస్సులు నగర రోడ్ల పై పరుగులు తీస్తుంటే..ప్రజలు వాటిని ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులు నడిపే డ్రైవర్లకు స్పెషల్  ట్రైనింగ్ ఇవ్వడంతోపాటు మెడికల్‌ పరీక్షలు కూడా చేశారు ఆర్టీసీ నిర్వాహకులు. ఈ క్రమంలో హైయర్ ఆఫీసర్స్ నుండి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే సంక్రాంతి నుంచి నగరవాసులకు ఎలక్ట్రికల్‌ బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ ఎలక్ట్రికల్‌ బస్సులకు చార్జింగ్‌ కోసం కంటోన్మెంట్‌, మియాపూర్‌-2 డిపోలో ప్రత్యేకంగా చార్జింగ్‌స్టేషన్లు రెడీ చేశారు. ఫస్ట్ టైమ్ అందుబాటులొకొస్తున్న 40 ఎలక్ట్రికల్‌ బస్సులను నగరంలోని పలు ప్రాంతాలనుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు నడపనున్న క్రమంలో ఏసీ బస్సుల చార్జీలే ఈ ఎలక్ర్టికల్‌ బస్సులకు వర్తిస్తాయని అధికారులు తెలిపారు.