టికెట్లు అమ్ముకున్నారు : ఉత్తమ్‌పై సర్వే సంచలన కామెంట్స్ 

  • Edited By: madhu , January 14, 2019 / 02:31 PM IST
టికెట్లు అమ్ముకున్నారు : ఉత్తమ్‌పై సర్వే సంచలన కామెంట్స్ 

హైదరాబాద్ : సర్వే సత్యనారాయణ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు తెలిసిన వారికి పరిచయం అక్కర్లేని పేరు.. విద్యార్థి దశలో యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్ లీడర్‌గా … ఉద్యోగిగా.. కార్మిక సంఘాల నాయకునిగా ప్రారంభమైన ఆయన ప్రస్తానం.. కేంద్ర మంత్రి అయ్యేలా చేసింది.. శాసనసభ్యునిగా పనిచేసిన అనుభవంతో పాటు ఎంపీగా రెండు సార్లు గెలిచిన సర్వేసత్యనారాయణ.. గాంధీ కుటుంబానికి నమ్మినబంటుగా పేరుపొందారు.. కానీ తాజాగా పీసీసీ సమీక్షలో చేలరేగిన వివాదం ఆయన్ను వార్తల్లో వ్యక్తిని చేసింది.. ఈ నేపథ్యంలో.. ఆయనతో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన ఉత్తమ్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. టికెట్లు అమ్ముకున్నారని…ఆయన్ను పార్టీ నుండి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. ఇంకా ఎలాంటి ఆరోపణలు..కామెంట్స్ చేశారో వీడియోలో చూడండి.