ఇదో సంచలనం : చరిత్ర తిరగరాసిన రైల్వే, బస్ జర్నీ

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగిన క్రమంలో కనీవినీ ఎరుగని రీతిలో ఓటు వేసేందుకు ఓటర్లు పోటెత్తారు.

  • Published By: veegamteam ,Published On : April 12, 2019 / 03:56 AM IST
ఇదో సంచలనం : చరిత్ర తిరగరాసిన రైల్వే, బస్ జర్నీ

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగిన క్రమంలో కనీవినీ ఎరుగని రీతిలో ఓటు వేసేందుకు ఓటర్లు పోటెత్తారు.

సికింద్రాబాద్ : ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగిన క్రమంలో కనీవినీ ఎరుగని రీతిలో ఓటు వేసేందుకు ఓటర్లు పోటెత్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మూడు రోజుల్లోనే 6 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక రికార్డ్ అని దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.

ఒక్క సికింద్రాబాద్ మాత్రమే కాదు.. హైదరాబాద్ సిటీలోని అన్ని రైల్వే స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి. సికింద్రాబాద్ స్టేషన్ నుంచే ఒక్క రోజే లక్షా 24వేల మంది మంది ప్రయాణికులు ఏపీకి వెళ్లగా..వారిలో 96 వేల మంది జనరల్‌ టికెట్‌ ప్రయాణికులు. 28 వేల మంది రిజర్వేషన్‌ చేయించుకున్నవారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక రికార్డని దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.

పోలింగ్ తో పాటు వేసవి సెలవులు
11న ఎన్నికల పోలింగ్‌తో పాటు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. దీంతో రైల్వే శాఖ 8, 9, 10 తేదీల్లో ఒక్క సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి 3లక్షల 40వేల మంది ప్రయాణికులు వారి వారి ఊర్లకు వెళ్లారు. హైదరాబాద్‌ లోని అన్ని స్టేషన్ల నుంచి 3 రోజుల్లో 6 లక్షల మంది ప్రయాణికులు వెళ్లారు. 
Read Also : JEE Advanced : 2 లక్షల 45వేల మందికి అవకాశం

ప్రత్యేక రైళ్లు వేసినా ప్రయాణికుల డిమాండ్‌తో పోలిస్తే రైళ్లు సంఖ్య సరిపోలేదు. తిరుపతి, కాకినాడ, విజయవాడ వరకే స్పెషల్ ట్రైన్స్.. విశాఖ ఏ ట్రైనూ లేదు. బెంగళూరు, చెన్నైలో ఉండే ఏపీ, తెలంగాణకు ఓట్ల కోసం వచ్చినవారి కోసం ఒక్క రైలూ వేయలేదు. అలాగే జంటనగరాల నుంచి ఖమ్మం, సిర్పుర్‌కాగజ్‌నగర్‌ వైపు కూడా అదే పరిస్థితి. అయినా ఎలాగైనా ఓటేయాలన్న పట్టుదలతో జనరల్‌ బోగీల్లోని టాయిలెట్ల దగ్గర నిలబడి మరీ ప్రయాణించారు. 

 బస్సు టాప్‌పై కూడా ప్రయాణం
బుధవారం బెంగళూరు నుంచి తెలుగు రాష్ట్రాలకు ఏపీ ఆర్టీసీ, కేఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ కలిపి వెయ్యికి పైనే బస్సులు వేసినా సరిపోలేదు. బస్ లోపన ఖాళీ లేక బస్సు టాప్‌పైన కూర్చుని మరీ ప్రయాణం చేశారు. బెంగళూరు నుంచి ఏపీ ఆర్టీసీ 320కి అదనంగా మరో 169  బస్సులు నడిపినా ట్రాఫిక్‌ జాంతో రావల్సిన బస్సుల కోసం అర్ధరాత్రి వరకు ఎదురుచూడాల్సి వచ్చింది.

హైదరాబాద్‌ నుంచి బస్సు సర్వీసలు 
ఏపీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్‌ నుంచి ఏపీకి నడిపే 532 బస్సులకు అదనంగా మరో 355 స్పెషల్ బస్సులు నడిపినా ఏమాత్రం సరిపోలేదు. టీఎస్‌ఆర్టీసీ కూడా  ఏపీకి  250 బస్సులకు అదనంగా మరో 400 వరకు ప్రత్యేక బస్సులు ఏపీకి నడిపినా ప్రయాణీకుల రద్దీతో పోలిస్తే అవి నామమాత్రం అయ్యాయి. పోలింగ్, వేసవి సెలవులతో రైల్వే, బస్సుల ప్రయాణం ఒక రికార్డుని సృష్టించింది.
Read Also : సినిమా ఆపుతారా : మమత సర్కార్‌కు రూ. 20 లక్షల ఫైన్