కష్టకాలంలో పోటీ చేయరా : డీకే అరుణ క్వశ్చన్

  • Published By: chvmurthy ,Published On : February 26, 2019 / 01:46 PM IST
కష్టకాలంలో పోటీ చేయరా : డీకే అరుణ క్వశ్చన్

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ అభ్యర్ధి ఎంపికపై మంగళవారం జరిగిన ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో సభ్యుల మధ్య వాడీవేడిగా  చర్చ జరిగింది. ఒకానొక దశలో అభ్యర్థుల ఎంపికపై ముఖ్యనేతల మధ్య తీవ్రవాగ్వివాదం జరిగింది. మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్ అభ్యర్థుల విషయంలో డీకే అరుణ, సంపత్ కుమార్, వంశీ చంద్ రెడ్డి, చిన్నారెడ్డి ల మధ్య డైలాగ్ వార్ నడచింది. 
Also Read : కారును పోలిన గుర్తులు తొలగించిన ఈసీ : టీఆర్ఎస్ కి ఊరట

నాగర్ కర్నూల్ టికెట్ కు సతీష్ మాదిగ పేరును డీకే అరుణ సూచించగా సంపత్  తీవ్ర అభ్యంతరం చెప్పారు. మహబూబ్ నగర్ టికెట్ జైపాల్ రెడ్డి కే ఇవ్వాలన్న డీకే అరుణ సూచించగా, ఆయన పోటీకి సుముఖంగా లేరని టీపీసీసీ అధ్యక్షుడు  ఉత్తమ్  కుమార్ రెడ్డి చెప్పారు.పార్టీ కష్టకాలంలో పోటీ చెయ్యకపోతే ఎలా అని డీకే అరుణ అభ్యంతరం తెలిపారు. అలాంటప్పుడు తన అనుచరులకు ఎందుకు టికెట్లు ఇప్పించుకున్నారని అరుణ ప్రశ్నించారు. డీకే వాదనను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి కుంతియా  సమర్ధించారు.  భువనగిరి నుంచి  మధుయాష్కీ పేరును జాబితాలో చేర్చడంపై సుధీర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయగా, నిజామాబాద్ నుంచే పోటీ చేయాలని షబ్బీర్ అలీ  యాష్కీకి సూచించారు.