తెలంగాణలో పవన్ కళ్యాణ్ పోరాటం: వీహెచ్ కలిసింది అందుకేనా?

  • Published By: vamsi ,Published On : September 9, 2019 / 09:51 AM IST
తెలంగాణలో పవన్ కళ్యాణ్ పోరాటం: వీహెచ్ కలిసింది అందుకేనా?

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో భేటి అయ్యారు. హైదరాబాద్ లోని జనసేన కార్యాలయానికి వెళ్లిన హనుమంతరావు.. పవన్ కళ్యాణ్ తో గంటన్నరపాటు భేటి అయ్యారు.

హైదరాబాద్ లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయిన వీహెచ్ పవన్ కళ్యాణ్ తో పలు అంశాలపై చర్చించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ తో తెలంగాణలోని పలు అంశాలపైన కూడా వి.హనుమంతరావు చర్చించినట్లు తెలుస్తుంది.

పార్టీ ఫిరాయింపులు, కాపు రిజర్వేషన్ల అంశం, తెలుగు రాష్ట్రాల్లో ప్రజా వ్యతిరేక విధానాలు.. తెలంగాణ రాష్ట్రంలో యురేనియం తవ్వకాలను నిరసిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన నిరసనలకు మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ను వీహెచ్ కోరినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆయన పోరాటానికి మద్దతు ప్రకటించినట్లుగా తెలుస్తుంది.

గతంలో తెలంగాణ ఎన్నికలకు ముందు వీహెచ్ ను కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే తన మద్దతు ప్రకటిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లేటెస్ట్ గా వీరిద్దరి కలయికపై అభిమానుల్లో చర్చ మొదలైంది.