కాచిగూడ మీదుగా వెళ్లాల్సిన పలురైళ్లు రద్దు

కాచిగూడ స్టేషన్‌లో నిన్న రెండు రైళ్లు ఢీకొనడంతో దెబ్బతిన్న ట్రాక్‌ మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. కాచీగూడ మీదుగా నడవాల్సిన రైళ్లను దక్షిణమధ్య రైల్వే తాత్కాలికంగా రద్దు చేసింది.

  • Published By: veegamteam ,Published On : November 12, 2019 / 05:57 AM IST
కాచిగూడ మీదుగా వెళ్లాల్సిన పలురైళ్లు రద్దు

కాచిగూడ స్టేషన్‌లో నిన్న రెండు రైళ్లు ఢీకొనడంతో దెబ్బతిన్న ట్రాక్‌ మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. కాచీగూడ మీదుగా నడవాల్సిన రైళ్లను దక్షిణమధ్య రైల్వే తాత్కాలికంగా రద్దు చేసింది.

కాచిగూడ స్టేషన్‌లో నిన్న రెండు రైళ్లు ఢీకొనడంతో దెబ్బతిన్న ట్రాక్‌ మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. 3వందల మంది సిబ్బందితో ట్రాక్‌, కేబులింగ్ వ్యవస్థను సరి చేస్తున్నారు. ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్ శాఖలు సంయుక్తంగా పనులు నిర్వహిస్తున్నాయి. 3 వందల మంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. పనులు మరికాస్త సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ రోజు కాచీగూడ మీదుగా నడవాల్సిన రైళ్లను దక్షిణమధ్య రైల్వే తాత్కాలికంగా రద్దు చేసింది. దెబ్బతిన్న రెండు రైల్‌ ఇంజన్లను యార్డ్‌కు తరలించారు. మరమ్మతు పనులు పూర్తయ్యాక పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత రైళ్ల రాకపోకలకు అవకాశం ఇస్తారు. 

ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 14 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందరికీ.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. అన్ని విభాగాల డాక్టర్లు.. అందుబాటులో ఉండి క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంతో.. నగరవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. 

ప్రమాదం విషయం తెలిసిన 10 నిమిషాల్లోపే.. రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే.. సహాయచర్యలు ప్రారంభించి.. గాయపడ్డవారిని దగ్గరిలోని ఆస్పత్రికి తరలించారు. తర్వాత.. ఫలక్‌నుమా నుంచి కాచిగూడకు వచ్చే రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపేశారు. నేటి మధ్యాహ్నం కల్లా ట్రాక్‌ను క్లియర్‌ చేసి రైల్వే సేవలను పునరుద్దరించేందుకు పనుల్లో వేగం పెంచారు. 

ప్రమాదానికి MMTS రైలు లోకో పైలట్ తప్పిదమే కారణమని రైల్వే అధికారులు ప్రాధమిక నిర్థారణకు వచ్చారు. రెండో నెంబర్ ప్లాట్‌ ఫామ్ నుంచి MMTS రైలు సిగ్నల్ ఇవ్వకుండానే ముందుకు కదిలిందని… హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. తాను హారన్‌కొట్టినా ఆగకుండా వచ్చి MMTS ఢీకొట్టిందని హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్‌ చెబుతున్నారు. అత్యవసర బటన్‌ను ప్రెస్‌ చేశానని… హారన్‌ కూడా కొట్టానని అయినా ఉపయోగం లేకపోయిందని చెబుతున్నాడు. ప్రమాద ఘటనపై రేపు విచారణ జరుగనుంది. హైదరాబాద్‌ భవన్‌ DRM కార్యాలయంలో రైల్వే భద్రతా విభాగం అధికారులు విచారణ చేపట్టనున్నారు.