వేధించే వాళ్లనే వాలంటీర్లు చేసిన షీ టీమ్

వేధించే వాళ్లనే వాలంటీర్లు చేసిన షీ టీమ్

మహిళలను మొబైల్ ఫోన్లలో, సోషల్ మీడీయా ప్లాట్ ఫాంలపై వేధింపులకు గురి చేసిన వాళ్లు కొత్తగా మారారు. వారినే వాలంటీర్లుగా వ్యవహరించేలా చేయగలిగింది షీం టీం. సైకాలజిస్టుల సహకారంతో కౌన్సిలింగ్ సెషన్స్ ఏర్పాటు చేసి వారిలో మార్పు తీసుకురాగలిగారు.

బాధితుల నుంచి కంప్లైంట్స్ రాగానే షీ టీం కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలుపెట్టాయి. మధ్యలో కొవిడ్ 19కారణంగా కౌన్సిలింగ్ ఇవ్వడానికి బ్రేక్ పడింది. దీంతో సెప్టెంబర్ నుంచి సైకాలజిస్టులు నేరుగా కలవడానికి బదులు వర్చువల్ సెషన్స్ ఏర్పాటు చేశారు. ఎందుకని మహిళలపై వేధింపులు చేస్తున్నారంటూ ప్రశ్నించి వారిలో మార్పు తీసుకువచ్చారు. వారిలో కొందరు షీ టీమ్స్ వాలంటీర్లుగా ఉండటానికి, అటువంటి వేదింపుల నుంచి కాపాడే విధంగా పోలీసులకు సహకరించేందుకు ముందుకొచ్చారు.



‘ఈ కౌన్సిలింగ్ పద్ధతి అనేది చాలా పాతది. అయినప్పటికీ మేం మరింత ఇంటరాక్టింగ్‌గా ఉన్నాం. 143మంది మేజర్లు, ఏడుగురు మైనర్లకు ఈ నెలలో కౌన్సిలింగ్ ఇచ్చాం. వేధింపులకు గురి చేసే వాళ్లకు సైకాలజిస్టులతో కౌన్సిలింగ్ ఇచ్చినప్పటి నుంచి పాజిటివ్ ఫలితాలు వస్తున్నాయి. మైండ్ సెట్‌లో మార్పులకు ఇదొక ఆరంభం’ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ బీ సుమతీ అన్నారు.
https://10tv.in/ktr-launches-ts-bpass/
సెప్టెంబర్‌లో 220మందికి కౌన్సిలింగ్ ఇచ్చాం. అంతకంటే ముందు షీ టీమ్స్ నెలకు 500మంది వరకూ కౌన్సిలింగ్ ఇవ్వగలిగేది. ప్రస్తుతం ఆ సంఖ్య 300 వరకూ తగ్గిపోయింది. వారిని చిన్న చిన్న గ్రూపులుగా విడగొట్టి అలా చేయడానికి గల కారణాలు తెలుసుకోవడం వల్ల ప్రవర్తనలో మార్పులు తీసుకురాగలిగారు. అదే సమయంలో మరోసారి అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా చేశారు.