రాక్సల్, బరౌణీలకు సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు

  • Published By: chvmurthy ,Published On : September 30, 2019 / 03:30 AM IST
రాక్సల్, బరౌణీలకు సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు

దసరా దీపావళి  పండుగలను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే బీహార్ లోని  రాక్సల్, బరౌణీలకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఇప్పటికే హైదరాబాద్, కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ఏపీలోని ముఖ్య పట్టణాలకు, చెన్నై, బెంగుళూరు లకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే ఇప్పడు బీహార్ కు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.

07009 నంబరుతో  సికింద్రాబాద్-బరౌణీ ప్రత్యేక రైలు అక్టోబరు 6,13,20,27, నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో  సికింద్రాబాద్ లో 22-15 గంటలకు బయలుదేరుతుంది.
07010 నంబరుతో బరౌణీ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు అక్టోబరు 9, 16, 23, 30, నవంబర్ 6, 13, 20, 27 తేదీల్లో బరౌణీలో ఉదయం గం.07-10 కి బయలుదేరుతుంది. 

07091 నంబరుతో సికింద్రాబాద్-రాక్సల్ ప్రత్యేక రైలు అక్టోబరు 1, 8, 15, 22, 29, నవంబరు 5, 12, 19, 26, తేదీల్లో సికింద్రాబాద్ లో 21-40 గంటలకు బయలు దేరుతుంది. 
07092 నంబరుతో రాక్సల్-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు అక్టోబరు 4, 11, 18, 25, నవంబర్ 1, 8, 15, 22, 29, తేదీల్లో రాక్సల్ లో  12-45 గంటలకు బయలు దేరుతుంది. ఈ రైళ్లు కాజీపేట, రామగుండం, మంచిర్యాల బలార్షా, నాగపూర్ ల మీదుగా ప్రయాణిస్తాయని రైల్వే అధికారులు  తెలిపారు.