మహిళల ఫిట్ నెస్ మెసేజ్ : 50 గంటలు..140 కి.మీటర్ల పరుగు

హైదరాబాద్‌: మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని మరోసారి నిరూపించి మహిళా శక్తిని చాటి చెప్పారు ఆరుగురు మహిళా మణులు.

  • Published By: veegamteam ,Published On : March 4, 2019 / 06:11 AM IST
మహిళల ఫిట్ నెస్ మెసేజ్ : 50 గంటలు..140 కి.మీటర్ల పరుగు

హైదరాబాద్‌: మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని మరోసారి నిరూపించి మహిళా శక్తిని చాటి చెప్పారు ఆరుగురు మహిళా మణులు.

హైదరాబాద్‌: మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని మరోసారి నిరూపించి మహిళా శక్తిని చాటి చెప్పారు ఆరుగురు మహిళా మణులు. నాలుగు పదుల వయసు దాటితే మహిళలకు దాదాపు వృద్ధాప్యం వచ్చేస్తుందనీ వారికి శక్తి సన్నగిల్లిపోతుందనే మాటలను తొక్కిపడేశారు ఈ పరుగుల మహిళలు. 50 గంటల్లో 140 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయటం విశేషంగా చెప్పుకోవాలి.
Also Read : ఐటీ గ్రిడ్ వివాదం: జడ్జి ముందుకు ఆ నలుగురు

వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ వరకు..ఏకంగా 140 కి.మీ. అల్ట్రా మారథాన్‌ పరుగును 50 గంటల్లో ఆరుగురు మహిళలు మార్చి 3న విజయవంతంగా పూర్తి చేశారు. మహిళల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహన కల్పించే లక్ష్యంతో చేపట్టిన 50 గంటల్లో 140 కిలోమీటర్లుహైదరాబాద్‌’ను 40 సంవత్సరాల వయసులోనూ అవలీలగా పూర్తి చేసి మహిళాశక్తిని చాటి చెప్పారు.

వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి వద్ద మార్చి 1న ప్రారంభమైన ‘వరంగల్‌ టు హైదరాబాద్‌’ పరుగు మార్చి 3న  నాగోల్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ముగిసింది. ఈ పరుగులో పాల్గొన్నవారు హైదరాబాద్ కు చెందిన రజిత మైనంపల్లి(42), లీనా రాయ్‌(48), వైశాలి మనె (38), సరిత నర్మెట్ట(42), దేవయాని హల్దార్‌(48), పూనం మెట్ట(48)లు ఈ 140 కి.మీ. పరుగును పూర్తి చేశారు. వీరంతా సాధారణ మహిళలే.. ఫిట్‌నెస్‌ కోసం ఈ సవాలును స్వీకరించి విజయవంతంగా పూర్తిచేసి మిగతా వనితల్లో స్ఫూర్తినింపారు.
Also Read : డేటా దొంగిలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్ పరువు తీశారు : లోకేష్

 వీరికి నాగోల్‌ మెట్రో స్టేషన్‌లో వద్ద పిన్న వయసులోనే ఎవరెస్ట్‌ అధిరోహించిన పూర్ణ మాలావత్‌, ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ కేవీబీరెడ్డిలు స్వాగతం పలికి అభినందించారు. వచ్చే ఆదివారం నెక్లెస్‌రోడ్‌లో ఐదో ఫింక్‌థాన్‌ హైదరాబాద్‌-19 ఉంటుందని రూపకర్త మిలింద్‌ సోమన్‌ తెలిపారు.