శ్రీలంక బాంబు పేలుళ్లు : హైదరాబాద్ లో అలర్ట్ 

ఎక్కడ ఏ బాంబు పేలుళ్లు జరిగినా దానికి మూలాలు హైదరాబాద్ నగరంతో ముడిపడి ఉంటున్నాయి.

  • Published By: veegamteam ,Published On : April 22, 2019 / 04:49 AM IST
శ్రీలంక బాంబు పేలుళ్లు : హైదరాబాద్ లో అలర్ట్ 

ఎక్కడ ఏ బాంబు పేలుళ్లు జరిగినా దానికి మూలాలు హైదరాబాద్ నగరంతో ముడిపడి ఉంటున్నాయి.

ఎక్కడ ఏ బాంబు పేలుళ్లు జరిగినా దానికి మూలాలు హైదరాబాద్ నగరంతో ముడిపడి ఉంటున్నాయి. శ్రీలంకలో బాంబు దాడులు జరిగిన ఒక్క రోజు ముందుగా హైదరాబాద్ నగర్ంలో ఐసిసి మూలాలు వెలుగులోకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీలంక పేలుళ్ల ఘటన అనంతరం హైదరాబాద్ ను పోలీసులు  అప్రమత్తం చేశారు. 

శ్రీలంకలో ఉగ్రవాదుల దుశ్చర్యలతో 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన క్రమంలో  హైదరాబాద్‌లో పోలీసు వర్గాలు అప్రమత్తమయ్యాయి. హైదరాబాద్‌లో ఏప్రిల్ 20న నగర శివారు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని శాస్త్రి పురంలో  ఓ యువకుడి ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు  కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుని ఓ యువకుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  అబుదాబి మోడ్యూల్‌కు చెందినట్లుగా అనుమానిస్తున్న మరో ఇద్దరు యువకులను ఎన్‌ఐఏ  అదుపులోకి తీసుకోవడం  కలకలం రేపింది. 
Also Read : తగ్గని ఇంటర్ మంటలు : అన్నింట్లో 80.. లెక్కల్లో మాత్రమే 5 మార్కులు

దేశంలో ఉగ్ర దాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలతో…ఢిల్లీ పోలీస్‌ బృందం 20న  హైదరాబాద్ లో సోదాలు జరిపింది.  ఐసిస్‌లో చేరి ముష్కర మూకల తరఫున పోరాటం చేసే ఉద్దేశంతో చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ బాసిత్‌ సిరియా, టర్కీ, ఆఫ్ఘనిస్థాన్‌ దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ 2018 లో పోలీసులకు దొరికాడు.ఇతడి ప్రయత్నాలకు ఐసిస్‌ సానుభూతిపరులు ఆర్థిక సహకారం అందించినట్లు సమాచారం. ఈ కుట్రలకు ఆజ్యం పోస్తున్నట్లుగా భావిస్తున్న పలువురు యువకుల్ని తాజాగా ఎన్‌ఐఏ విచారిస్తోంది.చాప కింద నీరులా ఉగ్రనీడలు నగరంలోనే  విస్తరిస్తున్నాయనే అనుమానాలు బలంగా వినిపిస్తున్న క్రమంలో… పొరుగు దేశంలో భారీ విధ్వంసం చోటు చేసుకోవడంతో పోలీసు వర్గాలు హైదరాబాద్ లో అప్రమత్తం చేశాయి. 
Also Read : బాప్ ఏక్ నెంబర్..బేటా దస్ నెంబర్ : జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు