సమ్మర్ ఎఫెక్ట్ : బస్సు సర్వీసులు నిలిపివేత

ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండవేడి, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

సమ్మర్ ఎఫెక్ట్ : బస్సు సర్వీసులు నిలిపివేత

ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండవేడి, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేసవి ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఎండలు

ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండవేడి, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేసవి ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఎండలు  పెరుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండల తీవ్రత ఉంటోంది. అక్కడక్కడా వేడి గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతున్నాయి. 35 నుంచి 37 డిగ్రీల వరకు  నమోదవుతున్నాయి.

తెలంగాణలో బుధవారం(మార్చి-6-2019) నుంచి ఎండలు దంచి కొట్టనున్నాయని, పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. 2018తో పోలిస్తే 2019లో  ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందన్నారు. ఎండల బారి నుండి ప్రజలను కాపాడటానికి ప్రత్యేక కార్యాచరణపై అధికారులు దృష్టి సారించారు.  వాతావరణ శాఖ అందించిన ప్రణాళికను అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్న అధికారులు.. వడదెబ్బ బాధితుల కోసం ఆసుపత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఎండతో పాటు వేడిగాలులు విపరీతంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే మధ్యాహ్నం సమయంలో 12 గంటల నుండి 4 గంటల వరకు  బస్సు సర్వీసులు నిలిపివేయాలని, ప్రయాణాలు సైతం ఆపేయాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఉపాధి హామీ కూలీలు, కార్మికులు పనిచేసే చోట టెంట్లను ఏర్పాటు  చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది, ఆశావర్కర్లు, పారామెడికల్ సిబ్బందికి వడ దెబ్బ తగిలితే అందించాల్సిన వైద్యంపై శిక్షణ ఇవ్వాలని  సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల ప్రధాన కూడళ్లలో తాగునీటి వసతి కల్పించాలన్నారు. ప్రయాణాలు చేసే వారికి తాగునీటిని, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని అధికారులు ఆదేశించారు.