గుడ్ న్యూస్ : ఏప్రిల్ 13 నుంచి వేసవి సెలవులు 

ఎండా కాలం..ఎండలు మండే కాలం..ఎండల్లో కాలం సెలవుల్ని కూడా తెచ్చేసింది. తెలంగాణాలో వేసవి సెలవుల్ని ప్రకటించింది ప్రభుత్వం.

  • Published By: veegamteam ,Published On : April 12, 2019 / 10:51 AM IST
గుడ్ న్యూస్ : ఏప్రిల్ 13 నుంచి వేసవి సెలవులు 

ఎండా కాలం..ఎండలు మండే కాలం..ఎండల్లో కాలం సెలవుల్ని కూడా తెచ్చేసింది. తెలంగాణాలో వేసవి సెలవుల్ని ప్రకటించింది ప్రభుత్వం.

హైదరాబాద్: ఎండా కాలం..ఎండలు మండే కాలం..ఎండల్లో కాలం సెలవుల్ని కూడా తెచ్చేసింది. తెలంగాణాలో వేసవి సెలవుల్ని ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకూ శనివారం (ఏప్రిల్ 13) నుంచి మే 31 వరకూ సెలవులు ఇస్తూ ప్రకటనను విడుదల చేసింది. దీంతో ఈ50 రోజులూ అన్ని స్కూళ్లనూ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Read Also : 21వేల మంది చిన్నారులతో ముంబై ఇండియన్స్ మ్యాచ్

కాగా 10  క్లాస్ తరువాత ఇంటర్ లో వస్తున్న విద్యార్ధులకు స్పెషల్ క్లాసుల పేరిట ఏ జూనియర్ కాలేజీ యాజమాన్యాలైనా క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే, పలు ప్రముఖ విద్యా సంస్థలు ఇంటర్ ప్రవేశం కోరుతున్న విద్యార్థులకు ముందుగానే క్లాసులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం.