ఊరుకాని ఊరులో అభాగ్యురాలి దీనావస్థ:ఆటో డ్రైవర్ల పెద్ద మనసు 

  • Published By: veegamteam ,Published On : April 19, 2019 / 03:59 AM IST
ఊరుకాని ఊరులో అభాగ్యురాలి దీనావస్థ:ఆటో డ్రైవర్ల పెద్ద మనసు 

జానెడు పొట్ట నింపుకునేందుకు ఊరు కాని ఊరు వచ్చారు. కాయకష్టం చేసి పొట్ట నింపుకుంటున్నారు. కానీ కష్టాల కండగండ్లు ఆమెను ముంచెత్తాయి. ఎండలకు తట్టుకోలేని కట్టుకున్నవాడి ప్రాణం కడతేరిపోయింది. దీంతో ఆమెకు ఏం చేయాలో తెలియలేదు. గుండెల్లోంచి గోదావరిలా పొంగుతున్న దు:ఖాన్ని ఆపుకోలేక..అల్లాడిపోయింది.

కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తునే ఉంది. ఆమె కన్నీళ్ల గుండెలపై పడకుండానే ఆవిరైపోయేంత భగభగలాడుతున్న ఎండలు. కానీ భర్త మృతదేహాం వద్ద 43 డిగ్రీల ఎండ సైతం ఆమెపై ప్రభావాన్ని చూపలేకపోయింది. సహచరుడి మృతదేహంపై పడి గుండెలవిసేలా ఏడిస్తునే ఉంది. ఈ దారుణ ఘటన  కొత్తగూడెం రైల్వే స్టేషన్‌ వద్ద చోటుచేసుకుంది. 
Also Read : TMC ప్రచారంలో బంగ్లా యాక్టర్స్: ఇండియా వదిలి పోమ్మంటు కేంద్రం ఆర్డర్స్

కూలీనాలి చేసుకుంటూ రైల్వే స్టేషన్ వద్దనే కాలం గడుపుతున్న బిహార్‌ వాసులు దీన స్థితి ఇది. బీహార్ లోని కఠోర్‌ జిల్లాకు చెందిన ఖలీల్, మిమ్మి దంపతులు కొంతకాలంగా కొత్తగూడెంలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇటీవల పెరిగిన ఎండలకు తాళలేక భర్త ఖలీల్‌ అనారోగ్యానికి గురై గురువారం (ఏప్రిల్ 19)తెల్లవారు జామున మృతిచెందాడు.

దీంతో ఏం చేయాలో తెలియని మిమ్మీ భర్త శవం వద్ద రోదిస్తూ ఉండిపోయింది. వీరికి ఎవరూ లేకపోవడంతో సాయంత్రం 6 గంటల సమయంలో పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మిమ్మి దస్థితిని చూసిన ఆటో డ్రైవర్లు కరిగిపోయారు. రోజంతా కష్టపడిన తమ సంపాదనలోంచి తలాకొంత వేసుకుని మొత్తం రూ.3,500 ఆర్థిక సహాయం అందించారు. ఖలీల్‌ అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఆమెను బిహార్‌లోని వారి బంధువుల వద్దకు చేరుస్తామని చెప్పారు ఆటో డ్రైవర్లు. 
Also Read : మురళీ మోహన్ కోడలుకు యాక్సిడెంట్: అపోలోలో చికిత్స