తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ పై ఉత్కంఠ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదని..ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇస్తే ఎలా అని హైకోర్టు ప్రశ్నించారు.

  • Published By: veegamteam ,Published On : January 7, 2020 / 08:20 AM IST
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ పై ఉత్కంఠ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదని..ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇస్తే ఎలా అని హైకోర్టు ప్రశ్నించారు.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది అన్నారు. ముందు షెడ్యూల్ విడుదల చేసి తర్వాత రిజర్వేషన్లు ప్రకటించిందని తెలిపారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమన్న పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదని..ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇస్తే ఎలా అని హైకోర్టు ప్రశ్నించారు.

పూర్తిస్థాయిలో నోటిఫికేషన్ విడుదల కాకుండా చట్టవిరుద్ధమని ఎలా అంటామని కోర్టు తెలిపింది. నోటిఫికేషన్ పై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పిటిషనర్ ప్రస్తావించారు. రాజ్యాంగానికి లోబడే ఈసీ నడుచుకుంటుంది..కాబట్టి కోర్టులు కలుగజేసుకోవద్దని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పిందని హైకోర్టు గుర్తు చేసింది. ఈసీ విషయంలో కలుగజేసుకోవద్దు..కానీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని పిటిషనర్ కోరారు. 

మున్సిపల్ రిజర్వేషన్లు, వార్డుల విభజనపై కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ సందర్భంగా నిన్న కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలు ఆపాలంటూ కాంగ్రెస్ వేసిన పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు.. మున్సిపల్ఎన్నికల నోటిఫికేషన్ కు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఈ రోజు సాయంత్రం వరకు నోటిఫికేషన్ ఆపాలని హైకోర్టు తెలిపింది. ఎన్నికల సంఘం నియమావళిలో ఏముందో చెప్పాలని ఆదేశించిన హైకోర్టు.. ఎన్నికల మాన్యువల్ సమర్పించాలని సూచించింది. 

కాంగ్రెస్ నేతల పిటిషన్ పై ఇవాళ మరోసారి కోర్టు విచారణ చేపట్టింది. మన్సిపల్ చట్టం ప్రకారం ముందు రిజర్వేషన్ల నోటిఫికేషన్ జారీ చేయాలని..ఆ తర్వాతే ఎన్నికల షెడ్యూల్ జారీ చేయాలనేది కాంగ్రెస్ వాదన. రిజర్వేషన్లు ఖరారు కాకుండా షెడ్యూల్ విడుదల చేశారని..దీని వల్ల అభ్యర్థులు కులధృవీకరణ పత్రాలు పొందడం ఇబ్బంది అవుతుందని తెలిపారు. అయితే కులధృవీకరణ ప్రతాలు తప్పనిసరి కాదని ఎన్నికల సంఘం చెబుతోంది. దీంతో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. .