Fires in Car : ఖైరతాబాద్ సిగ్నల్ వద్ద టాటా సుమో కారు దగ్ధం

హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద టాటా సుమో కారులో మంటలు చెలరేగాయి. అనంతరం కొద్దిసేపటికే కారు దగ్ధం అయిపోయింది.

10TV Telugu News

హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద టాటా సుమో కారులో మంటలు చెలరేగాయి. అనంతరం కొద్దిసేపటికే కారు దగ్ధం అయిపోయింది. కారు ఇంజన్ నుంచి చెలరేగిన మంటలు కారును దగ్ధం చేశాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దీంతో కారులో ప్రయాణం చేస్తున్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు.

10TV Telugu News