రైతు బీమా : రూ. 303 కోట్ల చెల్లింపు – కేసీఆర్

  • Published By: madhu ,Published On : January 20, 2019 / 08:07 AM IST
రైతు బీమా : రూ. 303 కోట్ల చెల్లింపు – కేసీఆర్

హైదరాబాద్ : ఏ రాష్ట్రం చేయని సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని..అందులో రైతు బీమా ఒకటని..రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జనవరి 20వ తేదీ అసెంబ్లీలో జరిగిన చర్చలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ సభ్యుడు గండ్ర వెంకటరమణ చేసిన కొన్ని వ్యాఖ్యలు అబద్దాలని ఖండించారు. ఇలాంటి అబద్దాలు మాట్లాడవద్దని హితవు పలికారు. 
ఏ విధంగానైనా రైతు మరణించినా..వారికి సహాయ పడాలనే ఉద్దేశ్యంతో రైతు బీమా పథకం ప్రవేశపెట్టడం జరిగిందని కేసీఆర్ సభకు తెలిపారు. ఎల్ఐసీ కింద పది రోజుల్లో బీమా వారికి వచ్చే విధంగా చేసినట్లు చెప్పారు. ఏ కార్యాలయం వెళ్లకుండా..ఎక్కడకు వెళ్లకుండానే రైతు బీమా వారికి వెళుతుందన్నారు. 6062 మంది రైతులకు రైతు బీమా పథకం అమలైందన్నారు. మొత్తంగా రైతు బీమా కింద రూ. 303 కోట్ల రూపాయలు చెల్లించినట్లు కేసీఆర్ వెల్లడించారు. 

 

Read More : తెలంగాణ అసెంబ్లీ : హామీలు 100 శాతం నేరవేరుస్తాం – కేసీఆర్