తెలంగాణ అసెంబ్లీ : హామీలు 100 శాతం నేరవేరుస్తాం – కేసీఆర్

  • Published By: madhu ,Published On : January 20, 2019 / 07:56 AM IST
తెలంగాణ అసెంబ్లీ : హామీలు 100 శాతం నేరవేరుస్తాం – కేసీఆర్

హైదరాబాద్ : ఎన్నికల సమయంలో తాము ఎలాంటి హామిలిచ్చామో తప్పకుండా 100 శాతం నేరవేరుస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. వందకు శాతం రైతుల ప్రభుత్వంగా టీఆర్ఎస్ ప్రభుత్వంగా ఉంటుందని పక్కాగా చెబుతున్నట్లు చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జనవరి 20వ తేదీ ఆదివారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యులు మాట్లాడారు. అనంతరం సభ్యులు లేవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్ సమాధానమిస్తూనే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడారు. 
వంద శాతం భూ రికార్డుల ప్రక్షాళన చేస్తాం.
ధరణి వెబ్ సైట్ రూపొందిస్తాం.
భూముల రికార్డుల మార్పిడిలో అవినీతి లేకుండా చేస్తాం.

రుణమాఫీ తప్పకుండా చేసి చూపిస్తాం : 
రుణమాఫీ చేయాలి..చేసినం..ఏకమొత్తంలో రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ అడ్డంగా పడిపోయిందన్నారు. పంజాబ్‌లో ఇప్పటి వరకు అమలు కాలేదని స్పష్టం చేశారు. లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామని చెప్పడం జరిగిందని..అలాగే మాఫీ చేస్తామన్నారు. సమైక్య పాలనలో చిన్న..పెద్ద రైతులు నష్టపోయారని..వారు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. లక్ష రూపాయలు చేస్తామని తాము చెబితే కాంగ్రెస్ మాత్రం రూ. 2 లక్షలు చేస్తామని చెప్పినా ప్రజలు పట్టించుకోలేదన్నారు. రైతు రుణమాఫీ విషయంలో విధి విధానాలు రూపొందిస్తున్నట్లు…గతంలో రుణమాఫీకి రూ. 17 వేల కోట్లు అయితే..ఇప్పుడు రూ. 24వేల కోట్లు అవసరం ఉంటుందన్నారు. 
గిట్టుబాటు ధర : 
గిట్టుబాటు ధర రేటు రాష్ట్రం నిర్ణయించలేదని…తానొక పాలసీని ఎన్నికల సమయంలో ప్రకటించినట్లు తెలిపారు. ఐకేపీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రతి నియోజకవర్గంలో రూపకల్పన చేసి 45వేలకు పైగా ఉన్న మహిళా సంఘాలకు వీటిని అప్పచెబుతామన్నారు. కల్తీల బెడద పోవాలంటే ఒక బ్రాండ్ రావాల్సినవసరం ఉందని…లిజ్జత్ పాపడ్ ఎలా ఎదిగిందో..అలా చేయడం జరుగుతుందన్నారు.
గండ్రవి అబద్దాలు 
కంటి వెలుగు పథకంలో భాగంగా వరంగల్ జిల్లాలో పలువురికి కళ్లు పోయాయని కాంగ్రెస్ సభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పడం సుద్ధతప్పన్నారు. కేవలం పరీక్షలు మాత్రమే చేస్తున్నామే..కానీ ప్రభుత్వ హాయాంలో ఆపరేషన్‌లు జరగలేదని సీఎం కేసీఆర్ వెల్లడించారు. 

 

Read More : రైతు బీమా : రూ. 303 కోట్ల చెల్లింపు – కేసీఆర్