తెలంగాణ బంద్ : తెగిన నేత బొటన వేలు

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా శనివారం ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో వామపక్షాలు నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

  • Published By: veegamteam ,Published On : October 19, 2019 / 07:52 AM IST
తెలంగాణ బంద్ : తెగిన నేత బొటన వేలు

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా శనివారం ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో వామపక్షాలు నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా శనివారం ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో వామపక్షాలు నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐఎంఎల్‌ నేత పోటు రంగారావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, విమలక్కలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు వాహనంలో ఎక్కించే క్రమంలో పోటు రంగారావు చేతి బొటనవేలు తెగిపోయింది. రెండు తలుపుల మధ్య వేలు పెట్టి కట్‌ చేశారని రంగారావు ఆరోపించారు. కేసీఆర్‌ నన్ను చంపమన్నాడా? అని పోలీసులను  ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు, ఇప్పుడు కార్మికుల పక్షాన నిలబడి పోరాడినందుకు ఇది నాకు బహుమానమా? అంటూ తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు బస్‌ భవన్‌ను ముట్టండించేదుకు ప్రయత్నించిన తెలంగాణ జనసమితి నేతలను కూడా అరెస్ట్‌ చేశారు.  

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బంద్ కొనసాగుతోంది. బంద్ కు మద్దతుగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో లెఫ్ట్ పార్టీలు నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐఎంఎల్‌ నేత పోటు రంగారావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, విమలక్కలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. వారిని బలవంతంగా వాహనంలో ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోటు రంగారావు చేతికి గాయమైంది. ఆయన బొటన వేలు తెగిపోయింది. అరెస్ట్ చేసి వాహనంలోకి ఎక్కించి డోర్ వేస్తున్న క్రమంలో ఆయన బొటన వేలు తెగింది. వెంటనే చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రికి రంగారావుని తరలించారు.

పోలీసుల తీరుపై వామపక్ష నేతలు మండిపడ్డారు. కేసీఆర్‌ నన్ను చంపమన్నాడా అని పోలీసులను ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు, ఇప్పుడు కార్మికుల పక్షాన పోరాడినందుకు ఇది బహుమానమా అంటూ సీరియస్ అయ్యారు. బంద్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల నిరసనకారులు బస్సులపై రాళ్ల దాడులు చేశారు. తాత్కాలిక డ్రైవర్లపై చేయి చేసుకున్నారు.