ప్రపంచ పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ, రూ.21వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్న అమెజాన్

  • Published By: naveen ,Published On : November 10, 2020 / 05:42 PM IST
ప్రపంచ పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ, రూ.21వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్న అమెజాన్

telangana care of investments: తెలంగాణ.. ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి మోస్ట్ ఫేవరబుల్ స్టేట్‌గా మారిందా.. విశ్వనగరంగా మారుతోన్న క్రమంలో ప్రపంచ పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందా.. ఔననే అనిపిస్తోంది..తాజాగా అమెజాన్ సంస్థ తన డేటా సేవల విభాగం అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుంచి దాదాపు 21వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఇందుకు కారణం.. హైదరాబాద్‌లో మూడు అవైలబులిటీ సెంటర్ల ఏర్పాటు చేయనున్న అమెజాన్ వెబ్ సర్వీసెస్.. ఒక్కో డేటా సెంటర్‌తో వేలాది మందికి ఉపాధి కల్పించనుంది.. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ పెడుతోన్న ఇన్వెస్ట్‌మెంట్ తెలంగాణ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఎఫ్‌డిఐ కావడం, హైదరాబాద్‌ కా జవాబ్ నహీ అన్పిస్తోంది..

అమెజాన్‌తో తెలంగాణ వాణిజ్యబంధం మరింత బలపడింది:
హైదరాబాద్‌లో అమెజాన్ క్లౌడ్ సెంటర్.. తెలంగాణ డెవలప్‌మెంట్ పాలసీకి దిగ్గజ కంపెనీల జై.. అమెజాన్ వెబ్ సర్వీసెస్‌తో ఇకపై డేటా అడ్డాగా సిటీ.. అభివృద్ధి పథంలో దూసుకుపోతోన్న తెలంగాణలో మొదటిసారిగా భారీ పెట్టుబడి వచ్చింది..ఏకంగా 20,761కోట్ల రూపాయలను డేటా, క్లౌడ్ సర్వీసెస్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు అమెజాన్ సంస్థ ముందుకు వచ్చింది.. దీంతో ఇప్పటికే భాగ్యనగరంలో అతి పెద్ద వేర్ హౌస్ కార్యాలయం ఏర్పాటు చేసిన అమెజాన్‌తో తెలంగాణ వాణిజ్యబంధం మరింత బలపడింది.

భారీగా ఉద్యోగ అవకాశాలు:
2022 మొదటి ప్రథమార్ధంలో కార్యకలాపాలు ప్రారంభించనున్న అమెజాన్ వెబ్ సర్వీసెస్‌, హైదరాబాద్‌లో 3 అవైలబులిటీ జోన్లు ఏర్పాటు చేస్తుంది.. ప్రతి అవైలబులిటీ జోన్ లో అనేక డేటా సెంటర్లు ఉంటాయ్..వీటి ద్వారా భారీగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయ్.. అమెజాన్ వెబ్ సర్వీసెస్-ఏడబ్ల్యూఎస్ పెట్టుబడి..తెలంగాణ ఏర్పాటైన తర్వాత వచ్చిన అతి పెద్ద ఎఫ్‌డిఐ..తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక, వేగవంతమైన పరిపాలనా విధానాలకు ప్రపంచ స్థాయి సంస్థలు ఆకర్షితులవుతున్నట్లు తాజా ఇన్వెస్ట్‌మెంట్ సైజ్ చూస్తేనే అర్ధమవుతోంది.. దాదాపు 21వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఒకే సంస్థ ఇన్వెస్ట్ చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలకు దక్కిన ప్రాధాన్యతగా మంత్రి కేటీఆర్ వర్ణించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడి కోసం దావోస్ టూర్ సందర్భంగా ప్రయత్నించినట్లు గుర్తు చేశారాయన.

భవిష్యత్తులో మరిన్ని డేటా కార్యాలయాలకు మార్గం:
మరోవైపు అమెజాన్‌ లాంటి ప్రఖ్యాత సంస్థ తన డేటా సెంటర్ల ఏర్పాటు చేయడం, భవిష్యత్తులో మరిన్ని డేటా కార్యాలయాలకు మార్గం చూపుతుందంటున్నారు. తెలంగాణలో ఏర్పాటవుతున్న డేటా సెంటర్ల ద్వారా డిజిటల్ ఎకానమీ ఐటీ రంగంలో మరిన్ని పెట్టుబడులతో పాటు.. గ్రోత్ రేటు దూసుకుపోయే అవకాశాలు కన్పిస్తున్నాయ్. అమెజాన్ ఏర్పాటు చేస్తున్న ఏషియా పసిఫిక్ రీజియన్ వెబ్ సర్వీసెస్‌తో వేలాది మంది డెవలపర్లకు, స్టార్టప్స్, ఇతర ఐటీ కంపెనీలకు క్లౌడ్ సేవలు అందుతాయ్. ఈ-కామర్స్, పబ్లిక్ సెక్టార్, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సేవల రంగాల్లో తమ కార్యకలాపాల విస్తృతి పెరిగేందుకు అవకాశం కలుగుతుంది. అంతేకాదు
ఎడ్యుకేషన్ సహా ఇతర రంగాల్లో పని చేస్తోన్న వారు కూడా ఈ క్లౌడ్ సర్వీస్‌లు పొందడం మరింత సులభమవుతుంది.

2024 నాటికి డేటా సెంటర్ మార్కెట్ 4 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా:
తెలంగాణ ప్రభుత్వం గతంలోనే అమెజాన్ డేటా సెంటర్ల కోసం స్థలం కేటాయించింది.. అప్పట్లో రెండు డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించగా… అమెజాన్ డేటా సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ADSIPL సమర్పించిన డాక్యుమెంట్ల ప్రకారం చందనవెళ్లి గ్రామంలో 66,003 చదరపు మీటర్ల స్థలంలోనూ, మీర్ఖాన్ పేట్ లో 82,833 చదరపు మీటర్ల స్థలంలోనూ డేటా సెంటర్లను ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు కూడా వచ్చేశాయ్.. అమెజాన్ డేటా సెంటర్ల కోసం ఈ రెండు చోట్లే కాకుండా రంగారెడ్డి జిల్లాలోని రావిర్యాలలో కూడా స్థలాన్ని కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. 2024 నాటికి డేటా సెంటర్ మార్కెట్ 4 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. క్లౌడ్ మార్కెట్‌లో అమెజాన్ లీడర్‌గా తన డామినేషన్ చాటుతోంది.

మిగిలిన దిగ్గజాలు కూడా హైదరాబాద్ బాట పట్టే చాన్స్:
మొత్తం మార్కెట్‌లో అమెజాన్ 33శాతం కలిగి ఉండగా… అజ్యూర్ 18శాతం, గూగుల్ క్లౌడ్ 9శాతం, చైనా కంపెనీ ఆలీబాబా క్లౌడ్ 6శాతం, ఐబిఎం క్లౌడ్ 5శాతం, సేల్స్ ఫోర్స్ 3శాతం, టెన్సెంట్ క్లౌడ్ 2శాతం, ఒరకిల్ 2శాతం వాటా దక్కించుకున్నాయ్.. క్లౌడ్ సర్వీస్‌లో అమెజాన్ వాటా 111 బిలియన్ డాలర్లు కలిగి ఉంది.. ఈ కామర్స్ పరంగానూ అమెజాన్ నంబర్ వన్.. భవిష్యత్తులో క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటాకు డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో అమెజాన్ హైదరాబాద్‌ని ఎంచుకోవడంతో.. ఇక మిగిలిన దిగ్గజాలు కూడా ఇదే బాట పట్టే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయ్.