మే 1 నుంచి ఆన్ లైన్ లో దేవాలయం టిక్కెట్స్  

  • Published By: veegamteam ,Published On : February 27, 2019 / 06:21 AM IST
మే 1 నుంచి ఆన్ లైన్ లో  దేవాలయం టిక్కెట్స్  

హైదరాబాద్ : మే 1 నుంచి యాత్రికుల కోసం ఆన్ లైన రిజర్వేషన్ సిస్టము ఏర్పాటు చేస్తామని దేవాదయ శాఖా..అటవీశాఖా  మంత్రి  ఇంద్రకరణ్  రెడ్డి తెలిపారు. యదాద్రిలోని శ్రీ లక్ష్మీనారసింహస్వామి దేవాలయం, బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయం..ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం..భద్రాచలం లోని శ్రీ సీతారామస్వామి ఆలయాలకు వచ్చే భక్తులు ఆన్ లైన్ లోనే టిక్కెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. రెండున్నర సంవత్సరాల్లో రాష్ట్రంలో పలు దేవాలయాలను పురర్నిస్తామని..పూర్తవుతుందని మంత్రి తెలిపారు. అవసాన దశలో ఉండే ఆలయాలకు మరమ్మతులు చేపడతామన్నారు.సీఎం కేసీఆర్ యాదాద్రి అభివృద్ధిని చేసేందుకు చేపట్టిన నిర్మాణాలను నిత్యం పర్యవేక్షిస్తున్నారన్నారు. త్రిదండి శ్రీ శ్రీ చిన్నా జీఎయార్ స్వామీ మార్గదర్శకంలో అన్ని పనులు జరుగుతున్నాయని తెలిపారు. 

 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు..కొత్తగా ఏర్పడిన జిల్లాలైన ములుగు..నారాయణపేట జిల్లాలలో జిల్లా కోర్టులు స్థాపించాలని కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే రెండు జిల్లాలలో జిల్లా కోర్టులు ఏర్పాటు చేయాలని హైకోర్టుకు వినతిపత్రం సమర్పించామన్నారు. నూతన శాఖలకి సంబంధించినంతవరకు, రాష్ట్రంలో అటవీప్రాంతాన్ని సంరక్షించాలని సీఎం కేసీఆర్ లక్ష్యంగా చేసుకున్నారనీ..దాని కోసం కృషి చేస్తున్నామన్నారు.తెలంగాణకు హరిత హరం కింద ఈ ఏడాది 100 కోట్ల మొక్కల మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒక్క హైదరాబాద్ పట్టణ పరిధిలో ఉన్న 1.50 లక్షల ఎకరాల అటవీ భూమిలకు పార్కులు అభివృద్ధి చేస్తామని తెలిపారు. 

 

పులులు మరియు ఇతర వన్యప్రాణుల కోసం ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్నారు. కవ్వాల్ దాదాపు 40 పులులకు ఆవాసంగా ఉందన్నారు. త్వరంలో తెలంగాణను గొప్ప పర్యావరణ-పర్యాటక కేంద్రంగా తయారవుతుంది మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అడవులలలో చెట్లు నరకటం..కలప అక్రమ రవాణా వంటి విషయాలలో సీఎం కేసీఆర్ కఠినంగా ఉన్నారనీ..అటువంటివారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కవ్వాల్ లో అటవీ మరియు వన్యప్రాణుల నిరంతర రక్షణ పర్యవేక్షిస్తున్నామన్నారు.  కవ్వాల్ ఫారెస్ట్ ను మరింతగా అభివృద్ది చేస్తామని మంత్రి తెలిపారు. 

హైదరాబాద్ నగరానికి 280 కి.మీటర్ల దూరంలోని మంచిర్యాలకు 60 కి.మీటర్ల దూరంలో ఉండే కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ 892.23 చదరపు కిలోమీటర్లు దూరంలో విస్తరించి ఉంది. ఈ కవ్వాల్ ఫారెస్ట్ పులులతో పాటు చిరుతలు..జింకలు…ఎలుగుబంట్లు వంటి పలు వన్య ప్రాణాలు ఆవాసంగా ఉంది.