తెలంగాణ బడ్జెట్ : కళ్యాణ లక్ష్మి రూ.1,450 కోట్లు 

  • Published By: veegamteam ,Published On : February 22, 2019 / 07:19 AM IST
తెలంగాణ బడ్జెట్ : కళ్యాణ లక్ష్మి రూ.1,450 కోట్లు 

హైదరాబాద్‌ : సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రిగా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరాలకు గాను మొత్తం రూ. లక్షా 82 వేల కోట్ల బడ్జెట్ ను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ.14 వందల 50 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. 

బడ్జెట్ ప్రవేశ పెట్టే క్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ.. తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామన్నారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించి చీకటి నుంచి వెలుగుల వైపు పయనించామనీ, రాష్ర్టంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామనీ చెప్పారు. తెలంగాణలో అనుసరిస్తున్న ప్రణాళిక దేశంలో చర్చకు కేంద్ర బిందువైందని తెలిపారు. 
Read Also: నిరుద్యోగ భృతికి రూ.1,810 కోట్లు కేటాయింపు

రాష్ట్రంలోని నిరుపేద (దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన) యువతుల వివాహాల కోసం రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014, అక్టోబర్ 2న ప్రవేశపెట్టిన పథకానికి విశేష ఆదరణ లభిస్తోంది.
Read Also: ఆరోగ్య తెలంగాణ : ENT, దంత పరీక్షల కోసం రూ.5వేల కోట్లు

2017, మార్చి 13న ప్రవేశపెట్టిన 2017-18 తెలంగాణ బడ్జెట్ లో ఈ పథకానికి  ఆర్థిక సాయాన్ని రూ.51వేల నుంచి రూ.75,116 లకు పెంచారు. 2018, మార్చి 19న రూ.1,00,116 కు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ. 1450 కోట్లు కేటాయించింది. 

Read Also: తెలంగాణ బడ్జెట్ : ఆసరా పెన్షన్స్ రూ.12 వేల 67 కోట్లు