తెలంగాణ బడ్జెట్ : నీటి పారుదలకు రూ.22,500 కోట్లు 

  • Published By: veegamteam ,Published On : February 22, 2019 / 07:47 AM IST
తెలంగాణ బడ్జెట్ : నీటి పారుదలకు రూ.22,500 కోట్లు 

తెలంగాణ 2019-20 ఆర్థిక సంవత్సరాలకు గాను సీఎం కేసీఆర్ ఆర్థిక మంత్రిగా  ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. దీంట్లో భాగంగా నీటి పారుదల రంగానికి రూ.22,500 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు.  

తొలి ఐదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులను చాలా వరకు పూర్తి చేయగలిగామనీ..మరో ఐదేళ్లు కూడా సాగునీటి ప్రాజెక్టులకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించటంతో 2019-20  బడ్జెట్‌లో సాగునీటి రంగానికి రూ.22,500 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. 
Read Also: తెలంగాణ బడ్జెట్ : ప్రతీ గ్రామానికి రూ.8 లక్షలు

ఐదేళ్లలో కృష్ణా, గోదావరిలలో తెలంగాణ వాటాను సమర్థంగా వినియోగించుకుని కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనుంచామనీ ధీమా వ్యక్తంచేశారు. తొలి నాలుగేళ్లలోనే ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసిందని.. 90 శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయని తెలిపారు.  
Read Also: తెలంగాణ బడ్జెట్ : కళ్యాణ లక్ష్మి రూ.1,450 కోట్లు

ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటిని ఈ వర్షాకాలంలోనే అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. రానున్న ఐదేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయని..మిషన్ కాకతీయ పథకంలో భాగంగా 20 వేలకుపైగా చెరువుల పునరుద్ధరణ జరిగిందనీ..కాలువల పునరుద్ధరణ చేసి పాత వైభవాన్ని తీసుకురానున్నట్లు  కేసీఆర్ స్పష్టం చేశారు.
Read Also: నిరుద్యోగ భృతికి రూ.1,810 కోట్లు కేటాయింపు