తెలంగాణ కేబినెట్ భేటీ : కొత్త రెవెన్యూ చట్టం.. ఆర్టీసీకి ఇచ్చిన హామీలే ఎజెండా

బుధవారం(డిసెంబర్ 11,2019) సాయంత్రం తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరగనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనే ప్రధానంగా మంత్రివర్గం చర్చించనుంది. రాబడి పెంపు, బడ్జెట్‌ కోతలపై

  • Published By: veegamteam ,Published On : December 11, 2019 / 03:09 AM IST
తెలంగాణ కేబినెట్ భేటీ : కొత్త రెవెన్యూ చట్టం.. ఆర్టీసీకి ఇచ్చిన హామీలే ఎజెండా

బుధవారం(డిసెంబర్ 11,2019) సాయంత్రం తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరగనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనే ప్రధానంగా మంత్రివర్గం చర్చించనుంది. రాబడి పెంపు, బడ్జెట్‌ కోతలపై

బుధవారం(డిసెంబర్ 11,2019) సాయంత్రం తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరగనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనే ప్రధానంగా మంత్రివర్గం చర్చించనుంది. రాబడి పెంపు, బడ్జెట్‌ కోతలపై సమీక్షించనుంది. అలాగే సాగునీటి పథకాలకు ఆమోదం తెలపనుంది. రైతు రుణమాఫీపై కేబినెట్‌లో స్పష్టత వచ్చే అవకాశముంది.

బుధవారంతో.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. గజ్వేల్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన తర్వాత.. సాయంత్రం ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలపై మంత్రివర్గ సమావేశంలో సమీక్షించనున్నారు. అదే విధంగా.. రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణను కూడా ప్రకటించే చాన్స్ ఉంది.

ఆర్థిక మాంద్యం పరిస్థితుల ప్రభావం రాష్ట్రంపై పడుతుందని.. ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనికితోడు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని సీఎం కేసీఆర్ చెబుతున్నారు. నిధుల కేటాయింపులో కేంద్రం కోతలు విధించడాన్ని సీఎం సీరియస్‌గా తీసుకున్నారు. త్వరలోనే.. ప్రధాని మోడీని కలిసి పరిస్థితిని వివరించే యోచనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై మంత్రులకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగేలా ప్రత్యేక నివేదికలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆర్థిక క్రమశిక్షణ పాటించేలా మంత్రులు, అధికారులు చర్యలు చేపట్టేలా నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వపరంగా అమలు చేస్తున్న వివిధ పథకాలపై ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

దుమ్ముగూడెం దగ్గర 37 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించడంతో పాటు జల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గోదావరి జలాలను కృష్ణ జలాలతో అనుసంధానం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ పథకాలకు 14 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రైతు రుణమాఫీపై ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ కేబినెట్ సమావేశంలో.. దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. మేనిఫెస్టోలో చెప్పిన హామీలపైనా నిర్ణయాలు వెలువడే చాన్స్ ఉంది.