కరోనా ఎఫెక్ట్.. తెలంగాణలో బంద్ అయ్యేవి, బంద్ కానివి ఇవే

తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా సీఎం కేసీఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీ

  • Published By: veegamteam ,Published On : March 14, 2020 / 04:33 PM IST
కరోనా ఎఫెక్ట్.. తెలంగాణలో బంద్ అయ్యేవి, బంద్ కానివి ఇవే

తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా సీఎం కేసీఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీ

తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా సీఎం కేసీఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీ తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు తెలిపారు. మార్చి 31 వరకు.. తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు మూసివేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తెలంగాణలో ఓ పాజిటివ్‌ కేసు నమోదు కాగా.. అతనికి విజయవంతంగా నయం చేశారు గాంధీ వైద్యులు. అయితే.. ఇవాళ మరొకరికి కరోనా సోకడంతో.. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంలో వచ్చే రెండు వారాలు చాలా కీలకంగా భావిస్తున్న సర్కార్..వీలైనంతగా ప్రజలు గుమిగూడకుండా చూడాలనుకుంటోంది.

తెలంగాణలో బంద్ అయ్యేవి, బంద్ కానివి ఇవే..
* ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు యథాతథం
* ప్రజలకు నిత్యావసరాల కొనుగోళ్లకు ఇబ్బంది, అసౌకర్యం కలగకుండా, సరుకుల కొరత లేకుండా సూపర్ మార్కెట్స్, మాల్స్, షాపులు మూసివేయడం లేదు
* స్కూళ్లు, హాళ్లు బంద్
* బార్లు, మెంబర్ షిప్ క్లబ్ లు మూసివేత
* కరోనా గురించి అసత్య ప్రచారాలు చేస్తే తీవ్ర చర్యలు, మీడియాకు సీఎం కేసీఆర్ వార్నింగ్
* అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్లు రద్దు
* ఇండోర్, ఔట్ డోర్స్ స్టేడియమ్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్ మూసివేత

* బహిరంగ సభలు, ఉత్సవాలు, ఎగ్జిబిషన్లు, కల్చరల్ ఈవెంట్లకు అనుమతి లేదు
* సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు
* మార్చి 31వరకు అన్ని రకాల స్కూళ్లు, కాలేజీలు మూసివేత
* విద్యా సంస్థలు తెరిస్తే తీవ్ర పరిణామాలు, పర్మిట్లు రద్దు
* మార్చి 31 నుంచి కల్యాణ్ మండపాలు మూసివేత
* మార్చి 31 తర్వాత ఫంక్షన్ హాల్స్ బుకింగ్ తీసుకోవద్దు
* 200 మందికి మించకుండా(అమ్మాయి తరుపు 100, అబ్బాయి తరపు 100) బంధువులను పిలిచి పెళ్లిళ్లు చేసుకోవాలి
* ఇప్పటికే నిర్ణయమైన పెళ్లిళ్లు చేసుకోవచ్చు

* దశలవారీగా ఫంక్షన్ హాల్స్ మూసివేత
* జన సమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లొద్దు
* కరోనా ఒకరి నుంచి ఒకరికి పాకుండా ఈ జాగ్రత్తలు
* ఈ రాత్రి(మార్చి 14,2020) నుంచి మార్చి 31వ తేదీ వరకు మూసివేత