అసలేం జరుగుతోంది : కాంగ్రెస్‌ నేతలు ముందే ఓటమిని అంగీకరిస్తున్నారా?

మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూనే.. అధికారులను టార్గెట్ చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్‌. ఎలక్షన్ షెడ్యూల్‌ ఎప్పుడు వచ్చినా గెలుపు మాదే అంటూనే.. ఎన్నికల

  • Published By: veegamteam ,Published On : December 30, 2019 / 01:49 AM IST
అసలేం జరుగుతోంది : కాంగ్రెస్‌ నేతలు ముందే ఓటమిని అంగీకరిస్తున్నారా?

మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూనే.. అధికారులను టార్గెట్ చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్‌. ఎలక్షన్ షెడ్యూల్‌ ఎప్పుడు వచ్చినా గెలుపు మాదే అంటూనే.. ఎన్నికల

మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూనే.. అధికారులను టార్గెట్ చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్‌. ఎలక్షన్ షెడ్యూల్‌ ఎప్పుడు వచ్చినా గెలుపు మాదే అంటూనే.. ఎన్నికల అధికారులంతా అధికార పార్టీ ఏజెంట్లుగా మారారని  ఆరోపిస్తోంది. ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా… ఎన్నికల అధికారులు, పోలీసులపై కాంగ్రెస్ లీడర్లు చేసిన విమర్శల వెనకున్న ఉద్దేశం ఏంటన్నది ఇపుడు చర్చనీయాంశమైంది.

తెలంగాణలో మున్సిపల్, కార్పోరేషన్ల ఎన్నికల ప్రకటన వచ్చిననాటి నుంచి కాంగ్రెస్ పార్టీ… అధికారులను టార్గెట్ చేసింది. మొన్నటివరకు… ఎన్నికల షెడ్యూల్‌ ఎప్పుడు వచ్చినా విజయం తమదేనని, అమలుకాని హామీలతో సర్కార్ విఫలమవుతున్నందున.. కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరుపై నడకేనని ఎంతో నమ్మకంగా చెప్పారు. తమ అభ్యర్ధులను సెలక్ట్ అండ్ ఎలక్ట్ పద్ధతిలో ఎంపిక చేస్తున్నామని ప్రకటించారు. కానీ… ఎలక్షన్ షెడ్యూల్‌ వచ్చాక సీన్ మారింది. కాంగ్రెస్ లీడర్ల టోన్ మారింది.

ఎన్నికల సంఘం ప్రకటించిన తేదీలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రిజర్వేషన్లు ప్రకటించకుండా, వార్డుల విభజన తేల్చకుండా, ఓటరు లిస్ట్ ఇవ్వకుండా ఎన్నికలు జరపడమేంటని ప్రశ్నిస్తోంది. ఇక ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఓ అడుగు ముందుకేసి అధికారపార్టీ కోరినట్లుగా అధికారులు ఎన్నికల తేదీలను ప్రకటించారని ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ బృందం… ఎన్నికల తేదీలు మార్చాలని కోరింది. అంతేకాదు.. నాగిరెడ్డిని టార్గెట్‌ చేస్తూ అఖిలపక్ష సమావేశాన్ని కూడా బాయ్ కాట్ చేసింది. 

మరోవైపు కాంగ్రెస్ అవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవ్‌ నేషనల్, సేవ్ కానిస్టిట్యూషన్ పేరుతో తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో కాంగ్రెస్ లీడర్లు మరింత కస్సుమన్నారు. పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్ పై ఉత్తమ్ సీరియస్ అయ్యారు. అయితే ఎన్నికల్లో గెలుపు ఓటమి సంగతి ఎలా ఉన్నా… అధికారులను టార్గెట్ చేయడం ద్వారా కాంగ్రెస్‌ నేతలు ముందే ఓటమిని అంగీకరిస్తున్నారా? ఓటమి కారణాలను ముందే కార్యకర్తలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? అనే టాక్‌ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

* మున్సిపల్ ఎన్నికల వేళ అధికారులపై కాంగ్రెస్ ఆగ్రహం
* పోలీసులు, ఎన్నికల అధికారుల తీరును తప్పుబట్టిన లీడర్లు
* మున్సిపల్ ఎన్నికల తేదీలపై కాంగ్రెస్ అభ్యంతరం
* రిజర్వేషన్ల తర్వాత నామినేషన్లకు గడువు ఇవ్వాలని డిమాండ్
* అధికారులు టీఆర్ఎస్‌కు తొత్తులుగా మారారని విమర్శలు
* పోలీస్‌ కమిషనర్‌పై ఫైర్ అయిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి