తెలంగాణ థియేటర్లలోనూ 100% సీటింగ్‌కు పర్మిషన్

తెలంగాణ థియేటర్లలోనూ 100% సీటింగ్‌కు పర్మిషన్

Telangana-Theatres

Telangana Theatres: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం థియేటర్ల ఓనర్లకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. వంద శాతం సీటింగ్ కెపాసిటీతో ప్రేక్షకులను రానివ్వొచ్చని చెప్పేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ ఇచ్చిన రిలాక్సేషన్లకు అనుగుణంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు పాస్ చేసింది.

ఈ మేరకు సీటింగ్ కెపాసిటీని థియేటర్లలో, మల్టీప్లెక్స్ లలో అనుమతించేశారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్స్ పాటించాలని థియేటర్ల ఓనర్లకు సూచించింది. ఇంతకంటే ముందు ఇచ్చిన అనుమతుల్లో కేవలం 50శాతం సీటింగ్ కుమాత్రమే పర్మిషన్ ఇచ్చారు. కొవిడ్ 19 కారణంగా డిసెంబర్ వరకూ థియేటర్లు మూతపడే ఉన్నాయి.