పంచాయతీ ఎన్నికలు : జనవరి 7 నుండి నామినేషన్లు

  • Published By: madhu ,Published On : January 6, 2019 / 01:25 AM IST
పంచాయతీ ఎన్నికలు : జనవరి 7 నుండి నామినేషన్లు

హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికలు కొద్ది రోజుల్లో జరుగనున్నాయి. ఆయా గ్రామాల్లో పంచాయతీ సందడి నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో తొలిఘట్టం ప్రారంభం కాబోతోంది. జనవరి 07వ తేదీ సోమవారం నుండి నామపత్రాల స్వీకరణ జరుగనుంది. తొలి విడతలో 4, 480 పంచాయతీల్లో అభ్యర్థుల నుండి రిటర్నింగ్ అధికారులు నామినేషన్ పత్రాలు స్వీకరించనున్నారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. 
తెలంగాణ రాష్ట్రంలోని 19 మినహా మిగతా 12,732 పంచాయతీల్లో ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. తొలి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పత్రాల స్వీకరణ సోమవారం నుండి ప్రారంభించనున్నారు. తొలి విడత పోలింగ్ జనవరి 21న జరుగనుండగా..మధ్యాహ్నం 2గంటల నుండి ఓట్లను లెక్కించి విజేతను ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచి ఎన్నిక ఉండనుంది. 

  • జనవరి 07 : నామినేషన్ పత్రాల స్వీకరణ. ఉదయం 10.30 నుండి సాయంత్రం 05 గంటల వరకు. 
  • జనవరి 09 : నామినేషన్ పత్రాలకు ఆఖరి డే. సాయంత్రం 5 గంటల వరకు. 
  • జనవరి 10 : నామినేషన్ పత్రాల పరిశీలన. సాయంత్రం 5గంటల వరకు. అనంతరం సక్రమంగా ఉన్న అభ్యర్థుల జాబితా తయారీ. 
  • జనవరి 11 : అప్పీలుకు చివరి తేదీ సాయంత్రం గంటల వరకు. 
  • జనవరి 12 : అప్పీలు పరిష్కారానికి చివరి రోజు. సాయంత్రం 3గంటలు. 
  • జనవరి 13 : నామినేషన్ పత్రాలకు ఉపసంహరణ. సాయంత్రం 3 గంటలు. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా రిలీజ్.
  • జనవరి 21 : పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్. ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1గంట వరకు.