రగులుతున్న ఇంటర్ మంటలు : మే 2 బీజేపీ రాష్ట్ర బంద్ 

  • Published By: veegamteam ,Published On : April 30, 2019 / 05:00 AM IST
రగులుతున్న ఇంటర్ మంటలు : మే 2 బీజేపీ రాష్ట్ర బంద్ 

ఇంటర్ మంటలు చల్లారటంలేదు. ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలు జరిగిన క్రమంలో రాష్ట్రంలో విపక్షాలు తమ ఆందోళనలకు ఉదృతం చేస్తున్నాయి. ఈ అంశాన్ని బీజేపీ ఉద్యమంగా మార్చేందుకు అడుగులు వేస్తోంది. మే 2వ తేదీన రాష్ట్ర బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. దీనికి సంబంధించిన తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలనీ లేకుండా జరగబోయే పరిణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని లక్ష్మణ్ హెచ్చరించారు. 

 

ఇంటర్‌ ఫలితాల వెల్లడిలో ఏర్పడిన తీవ్ర తప్పిదాలు..ఇప్పుడు 10వ క్లాస్ ఎలా జరగబోతోందన్న అనుమానాలున్నాయని లక్ష్మణ్ పేర్కొన్నారు.  కేసీఆర్‌ ప్రభుత్వం లక్ష లాది మంది విద్యార్థుల జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చివేసిందని విమర్శించారు. 10వ క్లాస్ ఫలితాల విషయంలోనైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లక్ష్మణ్ సూచించారు. గ్లోబరీనా సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారని, ప్లాన్‌ బి లేకుండా గందరగోళం చేశారన్నారు. విద్యార్ధుల ఆత్మ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.