షెడ్యూల్ విడుదల : మే 6, 10, 14 తేదీల్లో స్థానిక ఎన్నికలు

హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 3 విడతల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 6, 10, 14 తేదీల్లో స్థానిక సంస్థల

  • Published By: veegamteam ,Published On : April 20, 2019 / 10:59 AM IST
షెడ్యూల్ విడుదల : మే 6, 10, 14 తేదీల్లో స్థానిక ఎన్నికలు

హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 3 విడతల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 6, 10, 14 తేదీల్లో స్థానిక సంస్థల

హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 3 విడతల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 6, 10, 14 తేదీల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. మే 27న ఫలితాలు విడుదల చేస్తారు. ఏప్రిల్ 22న తొలి విడత నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు.
Also Read : టీడీపీ నేత సీఎం రమేష్ మేనల్లుడు ఆత్మహత్య

26న రెండో విడత, ఏప్రిల్ 30న మూడో విడత నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలంగాణ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. 538 జడ్పీటీసీ స్థానాలకు, 5వేల 817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 32వేల పోలింగ్ బూత్ లలో బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహిస్తారు. మండపేట జడ్పీటీసీ ఎన్నికను నిర్వహించడం లేదని నాగిరెడ్డి చెప్పారు.

ఎన్నికల వ్యయపరిమితి:
జెడ్పీటీసీ అభ్యర్థులకు గరిష్టంగా రూ.4లక్షలు
ఎంపీటీసీ అభ్యర్థులకు గరిష్టంగా రూ.లక్షా 50వేలు

* 3 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు
* తొలి విడత : ఏప్రిల్ 22న నోటిఫికేషన్, మే 6న పోలింగ్
* రెండో విడత : ఏప్రిల్ 26న నోటిఫికేషన్, మే 10న పోలింగ్
* మూడో విడత : ఏప్రిల్ 30న నోటిఫికేషన్, మే 14న పోలింగ్
* మే 27న ఫలితాలు
* ఏప్రిల్ 20వ తేదీ నుంచి కోడ్ అమలు, ఆన్ లైన్ లో నామినేషన్
* మండపేట మినహా 538 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు
* 5వేల 817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
* పదవీకాలం పూర్తికాని 40 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు లేవు
* తొలి దశలో 197, రెండో దశలో 180, మూడో దశలో 161 జెడ్పీటీసీలకు ఎన్నికలు
* బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే స్థానిక ఎన్నికలు    
* జెడ్పీటీసీలకు పింక్ పేపర్, ఎంపీటీసీలకు వైట్ పేపర్ కేటాయింపు
* ఓటర్లు – 1,56,11,320.. పోలింగ్ కేంద్రాలు-32,007
Also Read : వాహ్ : బ్యాలెట్ బాక్సులు మోసిన లేడీ కలెక్టర్