Telangana: స‌భ్య‌త‌, సంస్కారం ఉండాలి: ఈట‌ల రాజేంద‌ర్ ఆగ్ర‌హం

అన్యాయానికి, అవినీతికి వ్య‌తిరేకంగానే రాజ‌గోపాల్ పోరాటం అని ఈటల రాజేందర్ తెలిపారు. ఆయ‌న‌పై రేవంత్ చేసిన వ్యాఖ్య‌లు స‌రికాదని చెప్పారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారుతున్నారంటూ ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని అన్నారు. ''అవ‌త‌లి వారిపై బ‌ట్ట కాల్చి మీదేసీ పైకొచ్చిన‌ వ్య‌క్తి ఇప్పుడు మాపై విమ‌ర్శ‌లు చేయ‌డం ఏంటీ?'' అని ఆయ‌న నిల‌దీశారు. ఎదుటివారిని విమ‌ర్శించేట‌ప్పుడు స‌భ్య‌త‌, సంస్కారం ఉండాలని ఆయ‌న మండిప‌డ్డారు.

Telangana: స‌భ్య‌త‌, సంస్కారం ఉండాలి: ఈట‌ల రాజేంద‌ర్ ఆగ్ర‌హం

Etela Rajender Suspended

Telangana: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ మండిప‌డ్డారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి రాజీనామా ప్రకటనపై రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టారు. రేవంత్ వ్యాఖ్య‌లు జుగుప్సాక‌రంగా ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ లో ఈటల ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ అహంకారంతోనే గ‌తంలో టీడీపీ పుట్టుకొచ్చిందని అన్నారు. ద‌శాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చ‌లాయించిందని విమ‌ర్శించారు. కాంగ్రెస్‌ను, టీఆర్ఎస్‌ను వేర్వేరుగా చూడ‌లేమ‌ని చెప్పారు. తెలంగాణ కోసం కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి పోరాడారని అన్నారు.

అన్యాయానికి, అవినీతికి వ్య‌తిరేకంగానే రాజ‌గోపాల్ పోరాటం అని ఈటల రాజేందర్ తెలిపారు. ఆయ‌న‌పై రేవంత్ చేసిన వ్యాఖ్య‌లు స‌రికాదని చెప్పారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారుతున్నారంటూ ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని అన్నారు. అవ‌త‌లి వారిపై బ‌ట్ట కాల్చి మీదేసీ పైకొచ్చిన‌ వ్య‌క్తి ఇప్పుడు మాపై విమ‌ర్శ‌లు చేయ‌డం ఏంటీ? అని ఆయ‌న నిల‌దీశారు. ఎదుటివారిని విమ‌ర్శించేట‌ప్పుడు స‌భ్య‌త‌, సంస్కారం ఉండాలని ఆయ‌న మండిప‌డ్డారు.

నాలుగు పార్టీలు మారిన వ్య‌క్తి ఇప్పుడు త‌మ‌ వ్య‌క్తిగ‌త జీవితాల గురించి మాట్లాడుతున్నార‌ని ఆయ‌న అన్నారు. దేశంలో అంత‌రించిపోతోన్న పార్టీ కాంగ్రెస్ అని ఈటల రాజేందర్ చెప్పారు. ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిందని అన్నారు. కాంగ్రెస్ చిల్ల‌ర రాజ‌కీయాలు చేసిందని విమ‌ర్శించారు. కాంగ్రెస్ ఎందుకు క‌నుమ‌రుగ‌వుతుందే ఆత్మావ‌లోక‌నం చేసుకోవాల‌ని ఆయ‌న అన్నారు.

కాగా, తల్లిలాంటి సోనియా గాంధీకి అవమానం జరుగుతుంటే ఈ విష‌యంపై రోడ్డు పైకి వ‌చ్చి పోరాడాల్సిందిపోయి, బీజేపీలో చేరేందుకు సిద్ధమవడం సిగ్గుచేటని రాజ‌గోపాల్ రెడ్డిపై రేవంత్ రెడ్డి మండిప‌డిన విష‌యం తెలిసిందే. ఎల్లుండి మునుగోడులో నిర్వహించే సభకు త‌మ‌ పార్టీ శ్రేణులు తరలిరావాలని ఆయ‌న అన్నారు.

China: అమెరికా, తైవాన్‌పై ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్న చైనా.. కీల‌క చ‌ర్య‌లు