షెడ్యూల్ రెడీ : కేటీఆర్ జిల్లాల బాట

  • Published By: madhu ,Published On : January 5, 2019 / 01:14 AM IST
షెడ్యూల్ రెడీ : కేటీఆర్ జిల్లాల బాట

హైదరాబాద్ : TRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR  జిల్లాల పర్యటనకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఫిబ్రవరి నెల నుంచి జిల్లాల పర్యటన చేపట్టి పార్టీ శ్రేణులను లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం చేయాలని నిర్ణయించుకున్నారు. పార్టీ సభ్యత్వ నమోదుపై TRS నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు KTR శంకుస్థాపన చేయనున్నారు. 
పార్లమెంటు ఎన్నికల ముంగిటి జిల్లాల పర్యటన
పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేయత్నం 

సంక్రాంతి పండుగు తర్వాత జిల్లాల్లో పర్యటించి టీఆర్‌ఎస్‌ కార్యాలయాలకు శంకుస్థాపన చేయాలని ముందుగా నిర్ణయించుకున్నా… పంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో ఫిబ్రవరి నుంచి ప్రారంభించనున్నారు. పార్లమెంటు ఎన్నికల ముంగిట పర్యటన అన్ని విధాలుగా ఉపకరిస్తుందని కేటీఆర్‌ భావిస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు జిల్లాల పర్యటన దోహదం చేస్తుందని భావిస్తున్నారు.  ఫిబ్రవరి నుంచి పార్టీ సభ్యత నమోదు ప్రారంభించాలని నిర్ణయించారు. 
పంచాయతీ ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికలు 
మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు 
ఎంపీటీసీ, జడ్పీటీసీ, సహకార ఎన్నికలు 
ఆరు నెలల పాటు పార్టీ శ్రేణులతో కలిసి ఉండేలా ప్రణాళికలు 
పార్లమెంటు ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ శిక్షణా శిబిరాలు 

వరుసగా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులను అప్రమత్తంగా ఉంచాలని కేటీఆర్‌ నిర్ణయించుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయి.  ఆ తర్వాత మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికలు ఉన్నాయి. అనంతరం MPTC, ZPTC ఎన్నికలు, సహకార ఎన్నికలు ఉన్నాయి. ఆరు నెలల  పాటు అన్ని స్థాయిల్లో పార్టీ శ్రేణులతో కలిసి ఉండేవిధంగా  కేటీఆర్‌ ప్లాన్‌ చేసుకుంటున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు శిక్షణా శిబిరాలు నిర్వహించనున్నారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు కేటీఆర్ దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకుంటున్నారు.