సర్వం సిద్ధం : నేడు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ 

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణలోని 9 నగరపాలక, 120 పురపాలక సంఘాల్లో బుధవారం (జనవరి 22, 2020) పోలింగ్ జరగనుంది.

  • Published By: veegamteam ,Published On : January 21, 2020 / 06:51 PM IST
సర్వం సిద్ధం : నేడు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ 

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణలోని 9 నగరపాలక, 120 పురపాలక సంఘాల్లో బుధవారం (జనవరి 22, 2020) పోలింగ్ జరగనుంది.

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణలోని 9 నగరపాలక, 120 పురపాలక సంఘాల్లో బుధవారం (జనవరి 22, 2020) పోలింగ్ జరగనుంది. టెండర్‌ ఓటు ఒక్కటి పడినా ఆ ప్రాంతాల్లో రీ పోలింగ్‌ జరిపిస్తామని న్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి అన్నారు. ఎన్నికల్లో ధన ప్రవాహం అరికట్టేందుకు పార్టీల నేతలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మున్సిపల్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. రాష్ట్రంలోని 9 నగర పాలక సంస్థలు, 120 మున్సిపాలిటీల్లోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ ద్వారా ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తామని హెచ్చరించింది.  

9 కార్పొరేషన్లలోని 324 కార్పొరేటర్‌ పదవులతో పాటు 120 మున్సిపాలిటీల్లో 2647 కౌన్సిలర్‌ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో తెలుపురంగు బ్యాలెట్‌ పేపర్‌ను వినియోగిస్తున్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో బుధవారం సెలవు ప్రకటించారు. పోలింగ్‌ పూర్తి అయ్యే వరకు మద్యం దుకాణాలు, బల్క్ మెస్సేజ్‌లను నిషేధించారు. ఈనెల 25న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మరోవైపు కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో మాత్రం ప్రచార గడువు ఈనెల 22 వరకు ఉంది. 

రాష్ట్రంలో 53 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా ఆరున్నర లక్షల మంది, జనగామ జిల్లాలో అత్యల్పంగా 39వేల 729 మంది ఓటర్లు ఉన్నారు. దేశంలోనే తొలిసారిగా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ వినియోగిస్తుంది ఎన్నికల సంఘం. కొంపల్లిలోని 10 పోలింగ్ బూత్‌లలో పైలట్ ప్రాజెక్ట్‌గా యాప్‌ను వాడుతోంది ఎన్నికల సంఘం. 

టీఆర్‌ఎస్‌ నుంచి బరిలో 2 వేల 972 మంది అభ్యర్థులున్నారు. కాంగ్రెస్‌ నుంచి పోటీలో 2 వేల 616  మంది అభ్యర్థులున్నారు. బీజేపీ నుంచి బరిలో 2 వేల 313 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి 347మంది.. ఎంఐఎం 276 స్థానాల్లో పోటీ చేస్తోంది. సీపీఐ నుంచి 177 మంది, సీపీఎం నుంచి 166 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పలు గుర్తింపు పొందిన పార్టీల నుంచి 281 మంది పోటీ పడుతుండగా.. 3 వేల 750 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. 80 వార్డుల్లో టీఆర్‌ఎస్‌, 3 వార్డుల్లో ఎంఐఎం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎంపిక అయ్యారు.

టెండర్‌ ఓటు ఒక్కటి పడినా ఆ ప్రాంతాల్లో రీ పోలింగ్‌ జరిపిస్తామని న్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి అన్నారు. ఎన్నికల్లో ధన ప్రవాహం అరికట్టేందుకు పార్టీల నేతలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ఖర్చు వివరాలను తప్పుగా చూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ హెచ్చరించారు.

పోలింగ్‌ కేంద్రాల్లో పోటీ చేసే అభ్యర్థి వివరాలను నోటీసు బోర్డులో ఉంచుతామని, అభ్యర్థుల చరిత్ర, నేర చరిత్ర, ఆస్తుల వివరాలు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో విన్నింగ్ మార్జిన్ పదుల్లోనే ఉంటుందని, అందుకే ప్రతి ఓటు కీలకమైనదేనంటూ.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.