రేపే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు : మొదలైన క్యాంపు రాజకీయాలు

తెలంగాణలో రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో కౌంటింగ్‌కు ముందే క్యాంప్ పాలిటిక్స్‌ జోరందుకున్నాయి.

  • Published By: veegamteam ,Published On : January 24, 2020 / 05:25 PM IST
రేపే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు : మొదలైన క్యాంపు రాజకీయాలు

తెలంగాణలో రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో కౌంటింగ్‌కు ముందే క్యాంప్ పాలిటిక్స్‌ జోరందుకున్నాయి.

తెలంగాణలో రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో కౌంటింగ్‌కు ముందే క్యాంప్ పాలిటిక్స్‌ జోరందుకున్నాయి. అభ్యర్థులను కాపాడుకునే పనిలో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. జనగామ జిల్లాలో క్యాంపు రాజకీయాలకు కాంగ్రెస్‌ తెరలేపింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 15 మంది అభ్యర్థులను క్యాంపుకు పంపించింది. 15 మందిని కాంగ్రెస్ హైదరాబాద్‌ తరలించింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ కూడా క్యాంపు రాజకీయం మొదలుపెట్టింది. రామగుండం, వేములవాడ, కోరుట్ల, మెట్‌పల్లి టీఆర్ఎస్ అభ్యర్ధులను హైదరాబాద్‌కు తరలించింది.

జనవరి 27 చైర్మన్, వైఎస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆలోపే గెలిచే అభ్యర్థులను క్యాంపుకు తరలించాలి. విజయం సాధించే అవకాశాలపై సీరియస్ గా దృష్టి పెట్టి వారిని కూడా క్యాంపుకు తరలించాలి. తమకు మద్దతు కూడ గట్టుకుని చైర్మన్, మేయర్ పదవులను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు అంతా సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 134 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మధ్యాహ్నంలోపు ఫలితాలు వెలువడనున్నాయి.