పంచాయితీ ఎలక్షన్ : నేరాల చిట్టా విప్పాల్సిందే

పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్ధులతో పాటు వార్డ్ మెంబర్స్ కూడా తమ ఆస్తులతో పాటు నేర చరిత్ర గురించి కూడా చెప్పాల్సిందేనని ఈసీ స్పష్టం చేసింది. తెలంగాణ సీఎం  కేసీఆర్ నాయకత్వంలో నూతన పంచాయతీ రాజ్ చట్టం -2018 రూపొందించారు. 2003లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పంచాయతీ రాజ్ సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు నేర చరిత్ర, ఇన్ కమ్, ఖర్చులు..ఉమ్మడి ఆస్తులు, విద్యార్హతలతో కూడిన సమాచారాన్ని నామినేషన్ పత్రాలతో సమర్పించి బహిరంగ పర్చాలనే నిబంధన పెట్టింది.  ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఫుల్ ఇన్ఫర్మేషన్ తో నామినేషన్లు దాఖలు చేయాల్సివుంటుంది.

  • Published By: veegamteam ,Published On : January 5, 2019 / 07:43 AM IST
పంచాయితీ ఎలక్షన్ : నేరాల చిట్టా విప్పాల్సిందే

పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్ధులతో పాటు వార్డ్ మెంబర్స్ కూడా తమ ఆస్తులతో పాటు నేర చరిత్ర గురించి కూడా చెప్పాల్సిందేనని ఈసీ స్పష్టం చేసింది. తెలంగాణ సీఎం  కేసీఆర్ నాయకత్వంలో నూతన పంచాయతీ రాజ్ చట్టం -2018 రూపొందించారు. 2003లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పంచాయతీ రాజ్ సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు నేర చరిత్ర, ఇన్ కమ్, ఖర్చులు..ఉమ్మడి ఆస్తులు, విద్యార్హతలతో కూడిన సమాచారాన్ని నామినేషన్ పత్రాలతో సమర్పించి బహిరంగ పర్చాలనే నిబంధన పెట్టింది.  ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఫుల్ ఇన్ఫర్మేషన్ తో నామినేషన్లు దాఖలు చేయాల్సివుంటుంది.

హైదరాబాద్ : పంచాయితీ ఎన్నికలో ఎన్నికల కమిషన్ నిబంధనలను కఠినతరం చేసింది. పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్ధులతో పాటు వార్డ్ మెంబర్స్ కూడా తమ ఆస్తులతో పాటు నేర చరిత్ర గురించి కూడా చెప్పాల్సిందేనని ఈసీ స్పష్టం చేసింది. తెలంగాణ సీఎం  కేసీఆర్ నాయకత్వంలో నూతన పంచాయతీ రాజ్ చట్టం -2018 రూపొందించారు. 2003లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పంచాయతీ రాజ్ సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు నేర చరిత్ర, ఇన్ కమ్, ఖర్చులు..ఉమ్మడి ఆస్తులు, విద్యార్హతలతో కూడిన సమాచారాన్ని నామినేషన్ పత్రాలతో సమర్పించి బహిరంగ పర్చాలనే నిబంధన పెట్టింది.  ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఫుల్ ఇన్ఫర్మేషన్ తో నామినేషన్లు దాఖలు చేయాల్సివుంటుంది. నామినేషన్ పేపర్స్ పై సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి సంతకంతో పాటు మరో ఇద్దరు సాక్షులతో సంతకం చేయించి డిక్లరేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సబ్మిట్ చేయాలి. 

పోటీ చేసే అభ్యర్థితో పాటు జీవిత భాగస్వామి అంటే భర్త లేక భార్య, పిల్లలకు సంబంధించి ఆస్తుల వివరాలు అంటే కుటుంబ సభ్యుల పాన్ కార్డు, అకౌంట్ నెంబర్, లాస్ట్ ఫైనాన్ష్ ఇయర్  ట్యాక్స్ శాఖ ఇచ్చిన రిటర్న్‌లలకు సంబంధించిన ఇన్ కమ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాలి. జాయింట్ ఫ్యామిలీ అయితే వారి ప్రాపర్టీ లో వారికి వచ్చే వాటా కూడా తెలియజేయాలి. వారి హ్యాండోవర్లో వున్న క్యాష్..షేర్ మార్కెట్స్..బ్యాక్ ఎకౌంట్స్, డిపాజిట్లు, ఫైనాన్సియల్ సంస్థల్లో డిపాజిట్స్..షేర్ మార్కెట్‌ షేర్స్..పోస్టాఫీస్, ఇన్సూరెన్స్ పాలసీలు, వెహికల్స్, ప్లాట్స్..అప్పులు, ఇలా ప్రతీ ఇన్ఫర్మేషన్ ఆయా అభ్యర్థులు ఇవ్వాల్సిందే.

తప్పనిసరిగా నేర చరిత్ర వివరాలు
అభ్యర్థుల ఆస్తులతో పాటు వారిపై వున్న నేరాలకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా తెలియజేయాల్సివుంది. చిన్నా పెద్దా కేసుల వివరాలు..కేసుల సెక్షన్స్..ఏ పోలీస్ స్టేషన్‌, ఏ కోర్టులో కేసులు నడుస్తున్నాయి..శిక్ష పడిందా..పడితే  ఎంత కాలం..ఇలా ప్రతీ వివరాలతో కూడిన నేర చరిత్రను తప్పని సరిగా నామినేషన్ పత్రాలతో ఆయా పోటీ అభ్యర్థులు ఇవ్వాల్సి వుంటుంది. అంతేకాదు పూర్తిస్థాయిగా వారి వారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్..వారి రిమార్క్స్ లు కూడా కచ్చితంగా తెలపాల్సిందేనని ఎన్నికల కమిషన్ స్పష్టంచేసింది. తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ తో  రాష్ట్రంలో త్వరలోనే పంచాయితీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఈ నిబంధల విషయంలో ఈసీ అమలు చేయనుంది. దీంతో పోటీ అభ్యర్థులు వారికి సంబంధించిన అన్ని వివరాలను ఈసీకి సబ్మిట్ చేయాల్సివుంది.