పంచాయతీ సమరం :24 గంటల్లో తొలి విడత పోలింగ్

  • Published By: madhu ,Published On : January 20, 2019 / 04:37 AM IST
పంచాయతీ సమరం :24 గంటల్లో తొలి విడత పోలింగ్

హైదరాబాద్ : పంచాయతీ సమరం పోలింగ్‌కు ఒక్క రోజే మిగిలి ఉంది. జనవరి 21వ తేదీ సోమవారం ఎన్నికలు జరుగున్నాయి. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. తొలి విడుత పోలింగ్‌కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 3,701 గ్రామాల్లో పోలింగ్ జరుగనుంది. సర్పంచ్ స్థానాలకు 12,202 మంది అభ్యర్థులు, వార్డు స్థానాలకు 70,094 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు జరుగనుంది. 
పోలింగ్‌కు సర్వం సిద్ధం.
3,701 గ్రామ పంచాయతీల్లో ముగిసిన ప్రచారం.
12,202 మంది సర్పంచ్ అభ్యర్థులు.
70,094 మంది వార్డు అభ్యర్థులు.
ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్.
2 గంటల నుండి ఓట్ల లెక్కింపు.

పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపడుతారు. ముందు వార్డు స్థానాలు..తర్వాత సర్పంచ్ స్థానాల ఓట్లను అధికారులు లెక్కిస్తారు. ఇందుకు 1,48,033 మంది పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నారు. మొత్తం 26వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొననున్నారు. తొలి విడత ప్రచారం జనవరి 19వ తేదీ శనివారం ముగిసింది. ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు అధికారులు, పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్లను ఇబ్బందులకు గురి చేసే వారిపై పోలీసులు నిఘా పెట్టారు.

 

Read More : పంచాయతీ సమరం : నగరంలో పల్లె ఓటర్ల కోసం గాలింపుRead More : పంచాయతీ సమరం : ‘గుర్తుండేలా’ ప్రచారం
Read More : పంచాయతీ సమరం : ఆటోవాలా సర్పంచ్