పంచాయతీ సమరం : ‘గుర్తుండేలా’ ప్రచారం

  • Publish Date - January 20, 2019 / 04:20 AM IST

హైదరాబాద్ : అన్నా..గీ జగ్గు గుర్తుకే ఓటేయ్…అని ఒక అభ్యర్థి అంటే…అమ్మా..చెల్లి..అక్క..తమ్ముడు..గీ కత్తెర గుర్తుకు ఓటేయ్…అంటూ ఇంకో అభ్యర్థి…క్రికెట్ అనగానే గుర్తుకొచ్చే బ్యాట్ గుర్తుకు ఓటేయ్..అంటూ మరో అభ్యర్థి…ఏంటీ అనుకుంటున్నారా ? గదే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నయి కదా..పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల అధికారులు ఈ గుర్తులు కేటాయించింది. దీనితో వారు ఈ గుర్తులను పేర్కొంటూ ప్రచారం చేపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలయితే..కాంగ్రెస్‌ది ‘చేయి’..టీఆర్ఎస్‌ది ‘కారు’..టీడీపీది ‘సైకిల్’..ఇలా గుర్తుండిపోయే గుర్తులు. కానీ గీ పంచాయతీ సమరంలో బ్యాట్, కత్తెర, షటిల్, ఉంగరం…గ్లాసు..ఇలా ఎన్నో గుర్తులు అభ్యర్థులకు కేటాయించింది  ఎన్నికల సంఘం.
తమ గుర్తును ఓటర్లు మరిచిపోకుండా ఉండేందుకు వినూత్న దారులు వెతుక్కుతున్నరు. మార్కెట్‌లో దొరికే ఈ వస్తువులను కొనుగోలు చేసి..చేత పట్టుకుని మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు అభ్యర్థులు..వారి అనుచర గణం. ఇక కొంతమందైతే ఆయా గుర్తుల వస్తువులను కొనుక్కొని మరి పంచి పెడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల తమ గుర్తు వారికి గుర్తుండిపోతుందని..తద్వారా తమకే ఓటు వేస్తారని..అనుకుంటున్నారంట అభ్యర్థులు. ఈ గుర్తుల పుణ్యమా అని మార్కెట్లో ఆయా వస్తువులు మస్తు అమ్ముడుపోతున్నాయంట. ఎన్నికలా మజాకా..మరి…
మొత్తం 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 21న మొదటి విడత…జనవరి 25న రెండో విడత…జనవరి 30న మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. 
 

Read More : పంచాయతీ సమరం : నగరంలో పల్లె ఓటర్ల కోసం గాలింపు
Read More : పంచాయతీ సమరం : ఆటోవాలా సర్పంచ్

ట్రెండింగ్ వార్తలు