పల్లె పాలన షురూ

  • Published By: madhu ,Published On : February 2, 2019 / 01:52 AM IST
పల్లె పాలన షురూ

హైదరాబాద్ : గ్రామ పంచాయతీల్లో నూతనంగా ఎన్నికైన పాలకవర్గాలు పాలన స్టార్ట్ చేయనున్నారు. ఫిబ్రవరి 02వ తేదీ నుండి పాలన పగ్గాలు చేపట్టనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే మూడు దఫాలుగా పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. 12, 680 పంచాయతీలకు పాలకవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులు వీరితో ప్రమాణం చేయించనున్నారు. అనంతరం సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పాలన బాధ్యతలను తీసుకొంటారు. మొత్తం 12, 751 పంచాయతీలు ఉంటే నిర్వహించిన ఎన్నికల్లో 12, 680 పంచాయతీలకు 1, 13, 152 మంది వార్డులకు ఎన్నికలు ఎన్నిక పూర్తయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ మేరకు పాలకవర్గాలు తొలి తీర్మానం చేయనున్నాయి.