పంచాయతీ సమరం : 197 మండలాల్లో ‘నో లిక్కర్’

  • Published By: madhu ,Published On : January 20, 2019 / 04:07 AM IST
పంచాయతీ సమరం : 197 మండలాల్లో ‘నో లిక్కర్’

హైదరాబాద్ : పంచాయతీ సమరంలో ఫస్ట్ ఫేజ్ పోలింగ్‌కు ఒక్క రోజే మిగిలి ఉంది. జనవరి 21వ తేదీన 3,701 పంచాయతీలకు పోలింగ్ జరుగనుంది. ఇందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లు కీలకం. వీరిని ప్రసన్నం చేసుకొనేందుకు అభ్యర్థలు పడరాని పాట్లు పడుతుంటారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా అభ్యర్థులు ఓటర్లను అట్రాక్టివ్ చేసేందుకు పలు మార్గాలు వెతుకుతున్నారు. అందులో భాగంగా ‘మద్యం’ ఎరవేస్తున్నారు. ఎన్నికల సమయంలో వైన్ షాపులను మూసివేసే అధికారులు ఈ ఎన్నికల్లో కూడా అదే విధానం అనుసరించనున్నారు. 
ఎక్సైజ్ శాఖ ఆదేశాలు : 
ఎన్నికలు జరుగనున్న 194 మండలాల్లో వైన్ షాపులు మూసివేయాలని ఎన్నికల అధికారుల నిర్ణయంతో ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ జరగడానికి రెండు రోజుల ముందు సాయంత్రం 5 గంటలకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనితో జనవరి 19వ తేదీ సాయంత్రం నుండి దుకాణాలు బంద్ అయ్యాయి. ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాతే దుకాణాలు తెరుచుకుంటాయి. మద్యం పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభ పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని…గ్రామాల్లో నిరంతర గస్తీ…తనిఖీలు నిర్వహించాలని సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.