కాంగ్రెస్ సెకెండ్ లిస్ట్: ఉత్తమ్‌కే నల్గొండ సీటు

కాంగ్రెస్ సెకెండ్ లిస్ట్: ఉత్తమ్‌కే నల్గొండ సీటు

కాంగ్రెస్ సెకెండ్ లిస్ట్: ఉత్తమ్‌కే నల్గొండ సీటు

తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ అధిష్టానం సోమవారం అర్ధరాత్రి విడుదల చేసింది. ఇప్పటికే 8 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించిన కాంగ్రెస్.. మరో 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఖమ్మం లోకసభ స్థానం అభ్యర్థిని మాత్రమే కాంగ్రెస్ పెండింగులో పెట్టింది. ఈ సీటు కోసం నామా నాగేశ్వరరావుతో పాటు రేణుకా చౌదరి పోటీ పడుతుండడంతో అధిష్టానం సీటును పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తుంది.

ఇక టీపీసీసీ చీఫ్, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నల్లగొండ లోకసభ సీటుకు పోటీ చేయనున్నారు. మహబూబ్‌నగర్‌ స్థానానికి డీకే అరుణ, జి.మధుసూదన్‌రెడ్డి పేర్లపై చర్చ జరగగా ఈ స్థానానికి వంశీచంద్‌రెడ్డి పేరును అధిష్టానం ప్రకటించింది.

హైదరాబాద్‌ నుంచి ఫిరోజ్‌ ఖాన్, సికింద్రాబాద్‌ నుంచి అంజన్‌కుమార్‌ యాదవ్, నాగర్‌కర్నూల్‌ నుంచి మల్లు రవి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నిజామాబాద్‌ నుంచి మధుయాష్కీ గౌడ్, ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానమైన వరంగల్‌ నుంచి దొమ్మాటి సాంబయ్య బరిలో నిలిచారు.

తెలంగాణ పార్లమెంట్ అభ్యర్థుల వివరాలు: 
మహబూబ్ నగర్ – సీహెచ్ వంశీచందర్ రెడ్డి 
నల్గొండ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
వరంగల్ – దొమ్మాటి సాంబయ్య 
భువనగిరి – కోమటిరెడ్డి వెంకటరెడ్డి 
నాగర్ కర్నూల్ – మల్లు రవి 
నిజామాబాద్ – మధు యాష్కీ గౌడ్ 
హైదరాబాద్ – ఫిరోజ్ ఖాన్ 
సికింద్రాబాద్ – అంజన్ కుమార్ యాదవ్ 

×