మై..ముంతాజ్ అహ్మద్ ఖాన్ : టి.అసెంబ్లీ ప్రొటెం స్పీకర్

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జనవరి 17వ తేదీ ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగా ప్రొటెం స్పీకర్‌గా చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ జనవరి 16వ తేదీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.

  • Published By: madhu ,Published On : January 16, 2019 / 11:52 AM IST
మై..ముంతాజ్ అహ్మద్ ఖాన్ : టి.అసెంబ్లీ ప్రొటెం స్పీకర్

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జనవరి 17వ తేదీ ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగా ప్రొటెం స్పీకర్‌గా చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ జనవరి 16వ తేదీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జనవరి 17వ తేదీ ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగా ప్రొటెం స్పీకర్‌గా చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ జనవరి 16వ తేదీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌‌లో గవర్నర్ నరసింహన్‌ ఆయన చేత ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార మహోత్సవంలో సీఎం కేసీఆర్, హోం మంత్రి మహమూద్ ఆలీ, హరీశ్ రావు, కేటీఆర్ తదితరులు పాల్గొన్నారు. 

  • జనవరి 17 నుండి 20వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు. 
  • జనవరి 17వ తేదీన అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. 
  • రెండు గంటల పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమం. 
  • స్పీకర్ ఎన్నిక నామినేషన్ కార్యక్రమం. 
  • గన్ పార్కులో ఉదయం 11గంటలకు అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళులు.
  • జనవరి 18న స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల ఎన్నిక. 
  • జనవరి 19న ఉభయ సభల్లో గవర్నర్‌ ప్రసంగం. 
  • జనవరి 20న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం. 
  • గవర్నర్ ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్న కొప్పుల ఈశ్వర్‌. 
  • మండలిలో గవర్నర్ ధన్యవాద తీర్మానాన్నిప్రవేశ పెట్టనున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి.