సోమవారం నుంచి ఆర్టీసీ ఛార్జీలు పెంపు

  • Published By: veegamteam ,Published On : November 28, 2019 / 02:42 PM IST
సోమవారం నుంచి ఆర్టీసీ ఛార్జీలు పెంపు

సీఎం ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు అందించారు. కార్మికులు రేపు విధుల్లో చేరాలని పిలుపు ఇచ్చారు. కార్మికులంతా ఉద్యోగాల్లో జాయిన్ కావాలన్నారు. కార్మికులు ఇప్పటికైనా మేల్కొని విధుల్లో చేరాలన్నారు. తక్షణ సాయం కింద ఆర్టీసీకి రేపటి వరకు వంద కోట్లు అందిస్తామని చెప్పారు. 

నష్టాలను తగ్గించేందుకు ఆర్టీసీ చార్జీలు పెంచుతున్నామని చెప్పారు. వచ్చే సోమవారం నుంచి ఆర్టీసీ ఛార్జీలు పెంచుతామని అన్నారు. కిలో మీటర్ కు 20 పైసలు పెంచేందుకు ఆర్టీసీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చార్జీలు పెంచుకునేలా ఆర్టీసీకి ఆదేశాలు ఇస్తామని తెలిపింది.

సమ్మె విషయంలో కార్మికులకు బాధ్యతతో చెప్పడం జరిగిందన్నారు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ప్రజల పొట్టలను నింపినం.. కానీ.. ఎవరి పొట్టలు కొట్టడం లేదన్నారు. అధికంగా జీతాలు పొందుతున్న వారు… ఎక్కడ ఉన్నారంటే.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారన్నారు. ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాటలో పెడబారిన పడుతున్నారని దీనివల్ల సంస్థతో పాటు వారి జీవితాలు నాశనమౌతుందన్నారు.