హెచ్చరిక : ఫిబ్రవరి 8 వరకు పొగమంచు!

  • Published By: madhu ,Published On : February 4, 2019 / 01:20 AM IST
హెచ్చరిక : ఫిబ్రవరి 8 వరకు పొగమంచు!

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో చలి తగ్గుముఖం పట్టడం లేదు. పగటి వేళ్లలో ఎండగా ఉన్నా..రాత్రి వేళల్లో మాత్రం చలి దంచికొడుతోంది. మరో వారం రోజుల పాటు చలి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంటోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 30 నుండి 32 డిగ్రీల వరకు టెంపరేచర్స్ నమోదయ్యాయి. అయితే ఆదిలాబాద్, హన్మకొండ, రామగుండం, మెదక్, నల్గొండ, నిజామాబాద్, తదితర ప్రాంతాల్లో మాత్రం చలి తీవ్రత కొనసాగుతోంది. హైదరాబాద్‌లో మాత్రం ఉష్ణోగ్రత సాధారణస్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 8వ తేదీ వరకు రాత్రి..తెల్లవారుజామున పొగమంచు ఏర్పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు.