కల సాకారం : కోటి ఎకరాల్లో పంటల సాగు

తెలంగాణ కల సాకారమైంది. కోటి ఎకరాలకు సాగునీరు అందింది. రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం వ్యూహాలు, పాలసీలు ఫలితాన్ని ఇచ్చాయి. 2019లో

  • Edited By: veegamteam , September 14, 2019 / 02:35 AM IST
కల సాకారం : కోటి ఎకరాల్లో పంటల సాగు

తెలంగాణ కల సాకారమైంది. కోటి ఎకరాలకు సాగునీరు అందింది. రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం వ్యూహాలు, పాలసీలు ఫలితాన్ని ఇచ్చాయి. 2019లో

తెలంగాణ కల సాకారమైంది. కోటి ఎకరాలకు సాగు నిజమైంది. కోటి ఎకరాలకు నీరు అందింది, పంట సాగైంది. రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం వ్యూహాలు, పాలసీలు ఫలితాన్ని ఇచ్చాయి. 2019లో తెలంగాణలో వ్యవసాయంలో టర్నింగ్ పాయింట్. ఖరీఫ్ సీజన్ లో సాగులో సరికొత్త రికార్డ్ నమోదైంది. వరి, పత్తి సాగులో గణనీయమైన పురోగతి కనిపించింది. ఖరీఫ్‌ పంటల సాగు కోటి ఎకరాలకు మించి సాగైంది. ఖరీఫ్‌లో అన్ని పంటల సాగు సాధారణ విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా.. 1.02 కోట్ల ఎకరాలకు చేరింది. ఆ మేరకు వ్యవసాయ శాఖ సర్కారుకు నివేదిక పంపింది. రుతుపవనాలు చురుగ్గా ఉండటం, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు గణనీయంగా కురవడంతో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి నాట్లు పడ్డాయి. ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 24.11 లక్షల ఎకరాలు కాగా, 26.79 లక్షల ఎకరాలు (111%) సాగు కావడం గమనార్హం.

పత్తి సాగు విస్తీర్ణం సాధారణం కంటే పెరిగింది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 43.12 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 45.32 లక్షల ఎకరాలకు (105%) చేరింది. మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 12.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 9.46 లక్షల ఎకరాలు (76%) సాగైంది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.37 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 9.18 లక్షల ఎకరాలు (88%) సాగైంది. పప్పు ధాన్యాలు 90 శాతం, ఆహార ధాన్యాలు 102 శాతం, నూనె గింజలు 77శాతం విస్తీర్ణంలో సాగు చేశారు. ఈ ఖరీఫ్‌ లో సాగు విస్తీర్ణం సాధారణంతో పోలిస్తే 98 శాతం ఎక్కువ కావడం విశేషం. 

రాగి కూడా రికార్డ్ స్థాయిలో పండించారు. 33శాతం అధికంగా సాగైంది. సాధారణంగా 2వేల 600 ఎకరాల్లో రాగి సాగు అయ్యేది. ఈసారి అది 3వేల 464 ఎకరాలకు చేరింది. జొన్నలు, మినుములు, కందులు, ఉలవలు, సోయాబీన్, పసుపు.. ఇలా ఏ పంట చూసినా రికార్డ్ స్థాయిలో సాగైంది. పప్పు ధాన్యాల విషయంలోనూ సాగు రెట్టింపు అయ్యింది. 

సోయాబీన్‌ సాధారణ సాగు విస్తీర్ణం 5.25 లక్షల ఎకరాలు కాగా, 4.3 లక్షల ఎకరాలు (82%) సాగైంది. 11 జిల్లాల్లో వంద శాతంపైగా విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. అందులో నారాయణపేట, మంచిర్యాల జిల్లాల్లో 122 శాతం చొప్పున విస్తీర్ణంలో పంటలు సాగవడం గమనార్హం. నిర్మల్‌ జిల్లాలో 116 శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 113 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఒక్క ఖమ్మం జిల్లాలో అత్యంత తక్కువగా 80 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. 

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, కృష్ణా బేసిన్ లో సమృద్ధిగా నీరు, రిజర్వాయర్లలో నీటి లభ్యత సాగు పెరగడానికి కారణం అయ్యాయి. మిషన్ కాకతీయ సైతం మంచి ఫలితాలు ఇచ్చిందని రైతులు చెబుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, వనపర్తి, నారాయణపేట్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమురం భీం జిల్లాల్లో 100 శాతం సాగు జరిగింది. తెలంగాణలో పంట పొలాలు పచ్చగా కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఖరీఫ్ సీజన్ లో సాగు పండింది. దీంతో రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. ఈసారైనా మంచి లాభాలు వస్తాయని వారు ఆశిస్తున్నారు.