ఢిల్లీలో గవర్నర్ : రాష్ట్రాల పరిస్థితులపై నివేదికలు

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ మరోసారి హస్తిన బాట పట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగింది ? ఏం జరుగుతోంది ? తదితర విషయాలను కేంద్రంలోని పెద్దలకు విన్నవించారు. ప్రతి నెలా అన్ని రాష్ట్రాల గవర్నర్లు ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులను కలవడం ఆనవాయితీగా వస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గవర్నర్ ఢిల్లీ వెళ్లడం మొదటిసారి అని చెప్పవచ్చు. దానికంటే ముందుగా గత కొద్ది రోజుల కిందట సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ ఢిల్లీకి వచ్చిన తరువాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య విభజన హామీలపై ఉన్న విబేధాలు…తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు టాక్. సాయంత్రం హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో గవర్నర్ భేటీ కానున్నారు. విభజన సమస్యలు…హైకోర్టు విభజన తరువాత ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితుతులున్నాయి ? సమర్పించిన నివేదికలో గవర్నర్ పేర్కొన్నట్లు తెలు్సతోంది. జనవరి 11వ తేదీ కూడా ఆయన ఢిల్లీలోనే మకాం వేయనున్నారని తెలుస్తోంది. అయితే…దీనిపై అధికారికంగా షెడ్యూల్ ప్రకటన వెలువడాల్సి ఉంది.