అమెరికాలో దారి తప్పిన చదువులు : హైదరాబాద్‌లో తెలుగు విద్యార్థులు

  • Published By: madhu ,Published On : February 4, 2019 / 02:02 AM IST
అమెరికాలో దారి తప్పిన చదువులు : హైదరాబాద్‌లో తెలుగు విద్యార్థులు

హైదరాబాద్ : అమెరికాలో అరెస్టయిన తెలుగు విద్యార్థులు ఒక్కోక్కరిగా బయటపడుతున్నారు. విద్యార్థుల విడుదలకు తెలుగు సంఘాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా ఫిబ్రవరి 04వ తేదీ ఉదయం 02 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రాయానికి 30 మంది స్టూడెంట్స్ చేరుకున్నారు. వీరి రాక కోసం ఫిబ్రవరి 03 ఆదివారం రాత్రి నుండి విమానాశ్రయంలో తల్లిదండ్రులు పడిగాపులు పడ్డారు. విద్యార్థులు చేరుకోగానే వారి వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. దేశం కాని దేశంలో తమ బిడ్డలు కష్టాలు పడ్డారని…అమెరికా పన్నిన వలలో అమాయక విద్యార్థులు ఇరుక్కున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. 

చదువు పేరిట జాబ్‌లు చేస్తున్నారని అమెరికా గుర్తించి పలువురిని అరెస్టులు చేస్తోంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వల పన్ని, నకిలీ వర్సిటీ ఏర్పాటు చేసి…విద్యార్థి వీసాలు దుర్వినియోగం చేస్తున్న 130 మంది విద్యార్థులను 8 మంది దళారులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిలో భారతీయ విద్యార్థులు అత్యధికం. అందులో తెలుగు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వీరు బయట పడుతారా ? లేదా ? ఐదు రోజులుగా నడుస్తున్న ప్రచారంతో పేరెంట్స్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. వీరిని బయటకు తీసుకొచ్చేందుకు అమెరికా తెలుగు సంఘాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. జైళ్లలో ఉన్న వారందరినీ సంఘాల నేతలు కలుస్తూ న్యాయ సహాయం చేస్తున్నాయి. ఎలాంటి భయం అవసరం లేదని వారు భరోసా ఇస్తున్నారు. 

Read Also:  జీవితం తలకిందులు : అమెరికాలో హైదరాబాద్ అమ్మాయి దీనగాథ  

Read Also:  ఫార్మింగ్టన్‌ యూనివర్సిటీ కేసు : ఆ 8మంది డిటెన్షన్‌పై విచారణ 

Read Also: అమెరికాలో నిర్బంధం : హైదరాబాద్ కు చేరిన 30 మంది విద్యార్థులు

Read Also: షాక్ లో స్టూడెంట్స్ : అమెరికాలో మరో 5 ఫేక్ యూనివర్సిటీలు!