తగ్గుతున్న ఉష్ణోగ్రతలు : పెరుగుతున్న చలి

  • Published By: chvmurthy ,Published On : December 8, 2019 / 05:40 AM IST
తగ్గుతున్న ఉష్ణోగ్రతలు : పెరుగుతున్న చలి

రాష్ట్రంలో నానాటికీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరుగుతోంది. తూర్పు ఈశాన్య భారతదేశం నుంచి  తెలంగాణ వైపు తేమ గాలులు వీస్తున్నాయి.  రాత్రి పూట ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి.  ఆదిలాబాద్ జిల్లా అర్టి గ్రామంలో శనివారం  తెల్లవారుఝూమున  అత్యల్పంగా 10.5 డిగ్రీలు, ఆదిలాబాద్ లో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

హైదరాబాద్ లోనూ పగటి ఉష్ణోగ్రతలు  తగ్గుముఖం పట్టాయి. సాధారణం కన్నా 2.2డిగ్రీలు  తగ్గి26.6 డిగ్రీలుగా నమోదవుతోంది. ఉదయం పూట పొగమంచు ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైవేలపై ప్రయాణం చేసేవారు  అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చిరంచారు. మిగతా సమయంలో రాష్ట్రంలో పొడి  వాతావరణం ఉంటుందని వివరించారు.