బోర్డర్ లో టెన్షన్ : హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి విమాన సర్వీసులు బంద్

  • Published By: veegamteam ,Published On : February 27, 2019 / 10:22 AM IST
బోర్డర్ లో టెన్షన్ : హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి విమాన సర్వీసులు బంద్

హైద‌రాబాద్‌: భారత్-పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్తత వాతావ‌ర‌ణం నెల‌కొంది. బోర్డర్ లో టెన్షన్ వాతావరణంతో దేశవ్యాప్తంగా సున్నిత ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మిరేజ్ 2000 పాక్ పై దాడి అనంతరం ఫిబ్రవరి 27న రెండు దేశాల వైమానిక ద‌ళాలు మరోసారి దాడి ప్రతి దాడులు జరిగాయి.  ఈ క్రమంలో ఉత్త‌రాదిలోని కొన్ని విమానాశ్ర‌యాల‌ను మూసివేశారు. 

ఈ క్రమంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి అమృత్ సర్, చండీగఢ్, డెహ్రాడూన్‌లకు వెళ్లే విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు సంబంధిత విమానయాన సంస్థను సంప్రదించాలని అధికారులు సూచించారు.
Also Read: మానవబాంబుల తయారీ కేంద్రంగా బాలకోట్
 
కాగా పాకిస్థాన్ కూడా ఇప్పటికే  కొన్ని విమానాశ్ర‌యాల్లో నిషేధ ఆజ్క్ష‌లు జారీ చేసింది. లాహోర్‌, ముల్తాన్‌, ఫైస‌లాబాద్‌, సియాల్‌కోట్‌, ఇస్లామాబాద్ విమానాశ్ర‌యాల‌ను పాక్ మూసివేసింది. డొమెస్టిక్‌తో పాటు అంత‌ర్జాతీయ ఫ్ల‌ైట్ల‌ను నిషేధిస్తూ పాక్ ఆదేశాల‌ను జారీ చేసింది. భార‌త్‌, పాక్ గ‌గ‌న‌త‌లంలో ప్ర‌యాణించే అన్ని అంత‌ర్జాతీయ విమానాల రాక‌పోక‌ల‌పై ప్ర‌భావం ప‌డింది.

ఈ రూట్లో వెళ్లాల్సిన విమానాల‌ను ప్ర‌త్యామ్నాయ ఎయిర్ రూట్లో తీసుకువెళ్తున్నారు. క‌శ్మీర్‌లోని జ‌మ్మూ, శ్రీన‌గ‌ర్‌, లేహ్ విమానాశ్ర‌యాల‌ను కూడా మూసివేశారు. అమృత్‌స‌ర్‌, డెహ్రాడూన్ విమానాశ్ర‌యాల‌ను కూడా క్లోజ్ చేశారు. ఇలా రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న క్రమంలో పలు వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. 
Also Read: అణ్వాయుధాల టీమ్ తో ఇమ్రాన్ ఎమర్జన్సీ మీటింగ్