ఓయూలో టెన్షన్ టెన్షన్ : టీఆర్ఎస్‌వి విద్యార్ధి నేతల అరెస్టు

  • Published By: madhu ,Published On : October 26, 2019 / 12:48 AM IST
ఓయూలో టెన్షన్ టెన్షన్ : టీఆర్ఎస్‌వి విద్యార్ధి నేతల అరెస్టు

ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా ఉస్మానియా యూనివర్శిటీలో 25 విద్యార్ధి సంఘాలు చలో ఉస్మానియా కార్యక్రమం చేపట్టాయి. విద్యార్ధి జేఏసీ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్‌ కళాశాల వద్ద బహిరంగ సభ నిర్వహించాయి. అయితే..సభకు టీఆర్ఎస్వీ విద్యార్థులు దూసుకొచ్చారు. సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అప్పటికే అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆందోళన చేసిన  విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ జేఏసీ నేతలతో పాటు, పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. సమ్మెకు మద్దతు తెలిపిన విద్యార్ధి సంఘాల నేతలకు ఆర్టీసీ జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ.. అన్ని రంగాల్లో విఫలమైందని ఆర్టీసీ  జేఏసీ నేతలు విమర్శించారు. ఆర్టీసీ సమ్మెను విచ్చిన్నం చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

విద్యార్ధి సంఘాల సభకు ఆర్టీసీ జేఏసీ నేతలతో పాటు ప్రజాసంఘాల నేతలు మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా అందరూ రోడ్లమీదకు రావాలని పిలుపునిచ్చారు. కార్మికులు ఎవరు చనిపోవోవద్దని..అంతిమంగా విజయం  సాధిస్తామని ధైర్యం చెప్పారు. 
Read More : చర్చలకు వేళాయే : ఏజెండాలో లేని ఆర్టీసీ విలీనం!