తగ్గని ఇంటర్ మంటలు : అన్నింట్లో 80.. లెక్కల్లో మాత్రమే 5 మార్కులు

తెలంగాణలో ఇంటర్మీడియట్ మంటలు చల్లారలేదు.

  • Published By: veegamteam ,Published On : April 22, 2019 / 05:51 AM IST
తగ్గని ఇంటర్ మంటలు : అన్నింట్లో 80.. లెక్కల్లో మాత్రమే 5 మార్కులు

తెలంగాణలో ఇంటర్మీడియట్ మంటలు చల్లారలేదు.

తెలంగాణలో ఇంటర్మీడియట్ మంటలు చల్లారలేదు. అందరికీ న్యాయం చేస్తామని ప్రకటించిన అధికారులు.. తప్పిదాలను సరిదిద్దే చర్యలు మాత్రం వేగవంతం చేయలేదు. బోర్డ్ వైఖరికి నిరసనగా.. హైదరాబాద్ లోని ఇంటర్ బోర్డ్ ఎదుట ఆందోళనకు దిగారు స్టూడెంట్స్, పేరంట్స్. ఆందోళన తీవ్రంగా ఉండటంతో.. భారీగా మోహరించారు పోలీసులు. విద్యాశాఖ నిర్లక్ష్యం వల్లే విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి మంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్ధులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు స్టూడెంట్స్.
Also Read : ముందుకొస్తుందట : చెన్నైకి సముద్ర ముప్పు

స్టూడెంట్స్, పేరంట్స్ ఆందోళనకు ఏబీవీపీ విద్యార్థి సంఘం మద్దతు ప్రకటించింది. టాపర్స్ గా మార్కులు సాధించిన విద్యార్ధులకు కూడా 4, 5 మార్కులు ఎలా వస్తాయని నిలదీశారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి త్రిసభ్య కమిటీని వేశారు.  విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళన పడొద్దని భరోసా ఇచ్చారు మంత్రి. అయినా ఆందోళనలు ఆగటం లేదు. ఏప్రిల్ 22వ తేదీ బోర్డు ఎదుట ఆందోళనకు దిగిన పేరంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నిప్రశ్నలకు సమాధానాలు రాస్తే కేవలం 25 మార్కులు మాత్రమే వేశారని మండిపడ్డారు. చనిపోయిన విద్యార్థుల పరిస్థితి ఏంటని నిలదీశారు. చదువుకున్న వారికి- చదువు రాని వారికి ఒకే మార్కులు రావటం ఏంటని ప్రశ్నించారు. చదువురాని వాళ్లతో పేపర్లు దిద్దారని.. కనీస జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని అధికారులపై తీరుపై మండిపడ్డారు. 
Also Read : ఏదైనా జరగొచ్చు- టీజర్